అనుకోని ఉపద్రవం వస్తే, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తట్టుకునేది ఓ వారమే
ఇప్పటికిప్పుడు అనుకోని ఉపద్రవం వచ్చిపడితే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తట్టుకుని నిలిచేది కేవలం ఆ వారం రోజులేనని ఓ అధ్యయన సంస్ధ తేల్చిపారేసింది. ఓ పెద్ద ప్రకృతి విలయం లేదా మిలిటెంట్ల దాడి (9/11 దాడుల్లాంటివి కావచ్చు) వస్తే గనక అటువంటి వాటిని తట్టుకుని సుదీర్ఘ కాలం నిలవ గల శక్తి ఇప్పటి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు లేదని ఆ సంస్ధ తేల్చింది. 2010 లో ఐస్ లాండ్ అగ్ని పర్వతం పేలుడుతో ఎగజిమ్మిన బూడిద మేఘాలుగా…

