ఫ్రాన్సు అణు వ్యర్ధాల కర్మాగారంలో పేలుడు, ఒకరు దుర్మరణం

మరొక అభివృద్ధి చెందిన దేశంలో అణు కర్మాగారం పేలిపోయింది. భారత దేశానికి అణు రియాక్టర్లు అమ్మడానికి ఉరకలు వేస్తున్న దేశాలలో ఒకటైన ఫ్రాన్సులో అణు వ్యర్ధాలను ప్రాసెసింగ్ చేసే కర్మాగారంలో అణు వ్యర్ధాలను మండించడానికి వినియోగించే బట్టి పేలిపోయిందని ఫ్రెంచి పత్రికలను ఉటంకిస్తూ గార్డియన్ తెలిపింది. పేలుడులో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారనీ, గాయపడ్డ వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉందనీ తెలుస్తోంది. ఫ్రాన్సు ప్రపంచంలోనే అత్యధికంగా అణు ఇంధనం ఉపయోగిస్తుంది. తన విద్యుత్ ఉత్పత్తిలో అత్యధిక…