మాయావతి ఓ అనుమాన పిశాచి, డిక్టేటర్ -అమెరికా రాయబారి (వికీలీక్స్)

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఒక అనుమాన పిశాచి అనీ, డిక్టేటర్‌ను పోలి ఉండే అలవాట్లు గల వ్యక్తి అనీ అమెరికా రాయబారి, అమెరికా ప్రభుత్వానికి పంపిన కేబుల్‌లో పేర్కొన్న సంగతి వికీలీక్స్ ద్వారా వెల్లడయ్యింది. “పోర్ట్రయిట్ ఆఫ్ ఎ లేడీ” అన్న హెడ్డింగ్‌తో రాసిన ఈ కేబుల్‌లో మాయావతి దళిత కార్డుని ఉపయోగిస్తున్నప్పటికీ ఆమె ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి చేస్తున్నదేమీ లేదనీ, అభివృద్ధికి సైతం చేస్తున్నదేమీ లేదని రాయబారి పేర్కొన్నాడు. 2007 నుండి 2009 వరకూ…