శతాబ్దాల మర్రిమాను నిలువునా కూలినట్లు! -ఫొటో

గుండెలు అవిసేలా రోదిస్తున్న ఈ పెద్దాయనకి స్వాంతన ఎవరు ఇవ్వగలరు? శతాబ్దాల పాటు ఊరంతటికీ నీడనిచ్చిన మర్రిమాను నిలువునా కూలినట్లున్న ఈ దృశ్యం చూపరులను కంట తడిపెట్టేలా ఉంది. ఏం జరిగిందో తెలియని పాప అమాకపు చూపులు మరింతగా హృదయాలను పిండేస్తున్నాయి. తాతో, తండ్రో, మామయ్యో ఇంకెవరో గాని ఈయనని ఓదార్చడానికి కాసింత అవకాశం దొరికితే బాగుడ్ను. వెల్లూరు జిల్లాలోని అరక్కోణం వద్ద కిల్కండిగై వద్ద ఆగి ఉన్న పాసెంజర్ రైలును 90 కి.మీ వేగంతో వస్తున్న…