‘మాదే స్నాన’ ఇపుడు ఎంగిలాకులపై కాదట!
కర్ణాటకలోని కుక్కే సుబ్రమణ్య దేవాలయంలో జరుగుతున్న కుల దురాచారంలో ఇక ఎంగిలాకులను ఉపయోగించరు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకనుండి ‘ఎవరూ ఆరగించని’ ప్రసాదాన్ని ఆకుల్లో పెట్టి ఆరుబయట పరిస్తే ఆచారం పాటించదలిచినవారు వాటిపై పడి దొర్లొచ్చు. సుబ్రమణ్య ఆలయంలో కులాధిపత్య దురాచారాన్ని అడ్డుకోవాలని ఆలయంలో బ్రాహ్మణులు మాత్రమే ప్రసాదాన్ని ఆరగించే సౌకర్యాన్ని రద్దు చేయాలనీ హై కోర్టులో దాఖలయిన ఫిర్యాదుకు ఈ విధంగా పరిష్కారం లభించింది. పిటిషనర్లు కూడా సవరించిన దురాచారానికి ఆమోదం చెప్పడంతో వివాదాన్ని…
