ఛత్తీస్ ఘర్: పటేల్ హత్యకు సారీ -మావోయిస్టులు
ఛత్తీస్ ఘర్ పి.సి.సి అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్ పటేల్ ల హత్యకు సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీ క్షమాపణ చెప్పింది. తండ్రి కొడుకుల హత్య ద్వారా తమ కామ్రేడ్స్ భారీ తప్పిదం చేశారని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ నూతన కార్యదర్శి రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారని ది హిందు తెలిపింది. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు ఎవరో తమకు తెలియదని కానీ ఏడు పేజీల ఇంటర్వ్యూ తమకు చేరిందని పత్రిక…
