‘అనుజ్ బిద్వే’ హత్య కేసులో 17 ఏళ్ళ బ్రిటిష్ టీనేజర్ అరెస్టు
బ్రిటన్ లో సోమవారం తెల్లవారు ఝామున ఇరవై మూడేళ్ళ అనుజ్ బిద్వే హత్యకు గురైన కేసులో పదిహేడేళ్ళ బ్రిటిష్ టీనేజర్ ను అరెస్టు చేసినట్లుగా వార్తా పత్రికలు తెలిపాయి. ఏ కారణం గానీ, ఎటువంటి ముందస్తు కారణం గానీ లేకుండా జరిగినదిగా పోలీసులు చెబుతున్న ఈ హత్య ఇంగ్లండులోని భారతీయులలో ఆగ్రహావేశాలను కలిగించింది. ఫేస్ బుక్ లో ఇంగ్లండులోని భారతీయులతో పాటు ఇండియాలోని భారతీయులు కూడా ఈ హత్య పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సందేశాలను ప్రచురించారని…