గవర్నర్ అత్యాచారం: పోలీసు విచారణ నుండి ఎస్కేప్!
పశ్చిమ బెంగాల్ గవర్నర్ పైన ఆయన సిబ్బంది లోని మహిళ ఒకరు ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. పోలీసుల విచారణ నుండి తప్పించుకునేందుకు ఘనత వహించిన ఆ గవర్నర్ సిగ్గు లేకుండా తన గవర్నర్ గిరీని అడ్డం తెచ్చుకుంటున్నాడు. గవర్నర్ కార్యాలయంలో పని చేసే సిబ్బందిలోని మహిళ తనపై లైంగిక అత్యాచార ఆరోపణ చేసిన తర్వాత, ఏ మాత్రం ఆత్మ గౌరవం ఉన్నా, తాను నిర్వహిస్తున్న పదవి పట్ల ఇసుమంతైనా బాధ్యత ఉన్నా వెంటనే…






