మద్యధరా సముద్రంలో సిరియా సమీపాన మొహరించిన అమెరికా, రష్యా యుద్ధ నౌకలు
లిబియా విషయంలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి, లేని తిరుగుబాటుకి సాయంగా సైనిక జోక్యం చేసుకుని చివరికి ఆ దేశ అధ్యక్షుడిని చంపి, ఆల్-ఖైదాతో కుమ్మక్కయ్యి మరీ తొత్తు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు అదే తరహాలో సిరియాలో కూడా జోక్యం చేసుకోవడానికి అనేక కుట్రలు పన్నుతున్నాయి. అందులో భాగంగా అమెరికా ప్రవేశపెట్టిన అద్దె తిరుగుబాటుదారులే సిరియా ప్రజలపై కాల్పులు జరిపి పొట్టనబెట్టుకుంటున్నా, పశ్చిమ పత్రికలు రోజూ అనేక అబద్ధాలని సృష్టించి, సిరియా…