టెర్రరిస్టులకు ఐక్యరాజ్యసమితి మద్దతు? -సిరియా ప్రభుత్వం
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ‘బాన్-కి-మూన్’ సిరియాలో విధ్వంసం సృష్టిస్తున్న టెర్రరిస్టులకు మద్దతు ఇచ్చేలా ప్రకటనలు జారీ చేయడం పట్ల సిరియా పత్రికలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నాయని ‘అసోసియేటెడ్ ప్రెస్’ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. సమితి అధిపతి తన విమర్శలను పూర్తిగా సిరియా ప్రభుత్వంపైనే కేంద్రీకరించడం ద్వారా టెరరిస్టుల హింసను ప్రోత్సహిస్తున్నాడని సిరియా పత్రికలు విమర్శలు ఎక్కుపెట్టాయి. మానవ బాంబులను ప్రయోగిస్తూ వేలమంది ప్రజలను బలి గొంటున్న టెర్రరిస్టు చర్యలను ఖండిస్తూ అంతర్జాతీయ సంస్ధలు…














