ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలు!
అనుమానించినట్లే జరుగుతున్నది. ఇరాన్ గడ్డపై హమాస్ సంస్థ పోలిటికల్ లీడర్ ను హత్య చేయడం పట్ల ఇరాన్ తీవ్రంగా స్పందిస్తోంది. ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దేశంపై ప్రత్యక్ష దాడి చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఆలీ ఖమెనీ ఆదేశాలు ఇచ్చాడు. ఆలీ ఖమెనీ ఈ ఆదేశాలు ఇచ్చాడని ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక జులై 31 తేదీన తెలియజేసింది. సుప్రీం నేషనల్ కౌన్సిల్ (ఎస్.ఎన్.సి) అత్యవసరంగా జరిపిన సమావేశంలో ఖమెనీ ఈ…














