మార్కెట్లో ‘బై చైనా, సెల్ ఇండియా’ సెంటిమెంట్!
గోల్డెన్ వీక్ సెలవులు (అక్టోబర్ 1 నుండి 7 వరకు) ముగిసిన అనంతరం మంగళవారం చైనా స్టాక్ మార్కెట్లు వ్యాపారం నిమిత్తం తెరుచుకోనున్న నేపధ్యంలో మార్కెట్లో “బై చైనా, సెల్ ఇండియా” సెంటిమెంట్ జోరందుకుంది. గత 6 ట్రేడింగ్ రోజుల్లో 30 షేర్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఏకంగా 4,786 పాయింట్లు కోల్పోవడంతో బేర్ సెంటిమెంట్ బలంగా ఉన్నదనీ ఎఫ్.ఐ.ఐ లు ఇండియన్ షేర్ మార్కెట్ల నుండి చైనా స్టాక్ మార్కెట్ కు తరలిపోయేందుకు సిద్ధంగా…



