అతి భారీ కూరగాయలు -ఫొటోలు

సెప్టెంబరు 16 తేదీన ఉత్తర ఇంగ్లండులోని హారొగేట్ పట్టణంలో “హారోగేట్ ఆటమన్ ఫ్లవర్ షో జరిగింది. ఇది ఈ సంవత్సరం వందవ ప్రదర్శన జరుపుకుంటోంది. ఈ సారి ప్రదర్శనలో అతి భారీ కూరగాయల ప్రదర్శన విభాగాన్ని ఏర్పాటు చేయడంతో సాగుదారులు పోటీలు పడి ప్రదర్శనలో పాల్గొన్నారు. సాగుదారుడు డెరెక్ న్యూమన్ తన భారీ కేబేజి తో ప్రదర్శనకు వస్తున్నాడు. పీట్ గ్లేజ్ బ్రూక్, 8.15 కిలో గ్రాముల ఉల్లిపాయతో ఆశ్చర్యపరిచాడు