గాజా స్ట్రిప్: రక్తం ఓడుతున్న అరబ్బుల గాయం -పార్ట్ 1
– —–మహిళా పత్రిక ‘మాతృక’ అక్టోబర్ నెల సంచిక నుండి. (రచన: సుమన) ఈ జాత్యహంకార దుర్గంధం ఎచటిదంటే గాయాల గాజా వైపు చూపండి! పెట్రో డాలర్లు వెదజల్లుతున్న ఈ కర్బన ఉద్గారాల కమురు వాసన గాలులు ఎక్కడివంటే గాజా తీరాన్ని చూపండి! మానవతా చూపులను మసకబార్చుతున్న ఆ గంధకపు పేలుళ్ల పొగల మేఘాలు ఎక్కడ వర్షిస్తున్నాయంటే పుడమి తల్లి రాచపుండుగా మారిన గాజాలో సొమ్మసిల్లుతున్న మానవ దేహాలను చూపండి. మన ఇంటిపై కమ్మిన ఉప్పు భాష్పాల…




