రక్తం ఓడుతున్న బహ్రెయిన్ -కార్టూన్

లిబియా ప్రజలను గడ్డాఫీ నుండి రక్షించడం కోసం ఆరు నెలలపాటు లిబియా ప్రజలపైనే బాంబులు కురిపించాయి అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లండ్ దేశాలు. బహ్రెయిన్ పోలీసులే కాకుండా సౌదీ అరేబియా, కతార్ ల నుండి వచ్చిన పరాయి దేశాల పోలీసులు కూడా బహ్రెయిన్ ప్రజలపై హత్యాకాండ సాగిస్తున్నప్పటికీ ఆ దుష్ట త్రయం బధిరాంధులుగా మిగిలిపోయింది. అమెరికా సైనిక స్ధావరం ఉంచడానికి రాజు “హమద్ బిన్ ఇసా ఆల్ ఖలీఫా” అంగీకరించాడు కనుక అక్కడ ప్రభుత్వం ఎన్ని అరాచకాలకు పాల్పడినా…

మీరు లిబియన్లపై బాంబులేసుకొండి, మేం మా ప్రజల్ని చంపుకుంటాం -అమెరికా, సౌదీఅరేబియాల అనైతిక ఒప్పందం

ఒకరి దారుణాలను మరొకరు ఖండించుకోకుండా అమెరికా, సౌదీ అరేబియాల మధ్య అనైతిక ఒప్పందం సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ నిజం అరబ్ ప్రపంచానికి చెందిన వార్తా సంస్ధలకు ఎప్పుడో ఉప్పందింది. అరబ్, ముస్లిం ప్రపంచంలోని ప్రముఖ బ్లాగర్లు బైట పెట్టే వరకూ ఈ దారుణం ప్రపంచానికి తెలియలేదు. లిబియా పౌరులను గడ్డాఫీ సైన్యాలు చంపుతున్నాయంటూ కాకి గోల చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు తదితర పశ్చిమ దేశాలు బహ్రెయిన్, యెమెన్ ల ప్రభుత్వాధిపతులు అక్కడ…

బహ్రెయిన్ చీకటి రహస్యం -వీడియో

ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో ప్రజలు ఉద్యమించి నియంతృత్వ పాలకులను పదవీచ్యుతులను చేశాక ఆ దేశాల స్ఫూర్తితో ప్రజాందోళనలు మొదలైన అరబ్ దేశాల్లో బహ్రెయిన్ కూడా ఒకటి. బహ్రెయిన్ రాజు వెంటనే గద్దె దిగాలని బహ్రెయిన్ ప్రజలు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని కోరుకున్నారు. మొదట మళ్లీ పోటీ చేయననీ, 2013 లో తన పదవీ కాలం ముగిశాక ఇతరులకు అధికారం అప్పగిస్తామని హామీ ఇచ్చినా ప్రజలు అంగీకరించలేదు. ప్రజలకు అనేక తాయిలాలు ప్రకటించీన లొంగలేదు.…

బహ్రెయిన్ కి తమ సైనికులను పంపిన గల్ఫ్ దేశాలు

బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇస్సా అల్-ఖలీఫా వినతి మేరకు గల్ఫ్ దేశాలు తమ సైనికులను బహ్రెయిన్ కు పంపాయి. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జి.సి.సి) సభ్య దేశాల ఒప్పందం మేరకు ఈ సైనికుల తరలింపు జరిగింది. బహ్రెయిన్ రాజు నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలంటూ నెలన్నర పైగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. షియా గ్రూపుకి చెందిన ప్రతిపక్షాలు వారికి నాయకత్వం వహిస్తున్నాయి. రాజు చర్చలకు ఆహ్వానించినప్పటికీ వారు నిరాకరించారు. ఆదివారం, మార్చి 13 తేదీన నిరసనకారులపై పోలీసులు…

బహ్రెయిన్ హింస పై ఇంగ్లండ్ ఆందోళన

  బహ్రెయిన్ లో ప్రజల నిరసనల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చెలరేగటంపై ఇంగ్లండ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాందోళనలతో వ్యవహరించేటప్పుడు శాంతియుత చర్యలకు పరిమితం కావలసిన అవసరాన్ని బహ్రెయిన్ ప్రభుత్వానికి నొక్కి చెప్పినట్లు ఇంగ్లండ్ ఫారెన్ సెక్రటరీ విలియం హేగ్ బ్రిటిష్ కామన్స్ సభలో సభ్యులకు తెలియ జేశాడు. అవసరమయితే తప్ప బహ్రెయిన్ ద్వీపానికి ప్రయాణం పెట్టుకోవద్దని హేగ్ బ్రిటన్ పౌరులకు సలహా ఇచ్చాడు. బహ్రెయిన్ రాజధాని మనామాలోని “పెరల్ స్క్వేర్” లో గుడారాలు వేసుకొని ఉన్న…

బహ్రెయిన్ ఆందోళనకారులపై ఉక్కుపాదం

  మరిన్ని ప్రజాస్వామిక హక్కుల కోసం డిమాండ్  చేస్తున్న ఆందోళనకారులపై బహ్రెయిన్ ప్రభుత్వం కఠినంగా అణచివేస్తున్నది. టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ ఛార్జి చేయటమే కాకుండా కాల్పులు కూడా జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు చనిపోయారు. మరొకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వంద మందికి పైగా గాయపడ్డారు. హెచ్చరికలేమీ లేకుండా లాఠీ చార్జీ చేసి కాల్పులు జరిపినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. శాంతి బధ్రతల కోసం చర్యలు అనివార్యమయ్యాయనీ, చర్చల ద్వారా నచ్చ జెప్పటానికి అన్ని ద్వారాలు మూసుకు…

బహ్రెయిన్ ను తాకిన అరబ్ ప్రజా ఉద్యమ కెరటం

  ట్యునీషియాలో జన్మించి ఈజిప్టులొ ఇసుక తుఫాను రేపి పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలను గడ గడా వణికిస్తున్న అరబ్ ప్రజా ఉద్యమ మహోత్తుంగ తరంగం అరేబియా అఖాతంలో ఓ చిన్న ద్వీప దేశం ఐన బహ్రెయిన్ ను సైతం తాకింది. ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో దశాబ్దాల పాటు అధ్యక్షులుగా చెలామణి అవుతూ వచ్చిన నియంతృత్వ పాలకులను కూలదోసిన ఈ పోరాట తరంగం ఇప్పుడు బహ్రెయిన్ లో మత వివక్షకు వ్యతిరేకంగా, రాజకీయ సంస్కరణల కోసం ప్రజలను వీధుల్లోకి లాక్కొచ్చింది.…