ఎపికి ఇచ్చేది గ్రాంటు కాదు, ప్రపంచ బ్యాంకు అప్పు

Amaravati the Ghost Town 2024-25 బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయింపులు ప్రకటించారు. టిడిపి, జెడి(యు) పార్టీల మద్దతు పైన బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నందునే ఆర్ధిక మంత్రి ‘కుర్సీ కో బచావో’ పధకం మేరకు ఆ రెండు రాష్ట్రాలకు నిధులు ప్రకటించిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించాడు. ఇతర రాష్ట్రాలపై వివక్ష చూపిందని ఆరోపించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి…

రెండిందాల నష్టపోతున్న మిడిల్ క్లాస్!

పన్ను చెల్లింపుదారుల్లో కార్పొరేట్ కంపెనీల కంటే మిడిల్ క్లాస్ ఆదాయంతో రోజులు కనాకష్టంగా వెళ్లదీసే వర్గమే అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నారని గత ఆర్టికల్ లో, ప్రభుత్వం విడుదల చేసిన ఆర్ధిక సర్వే సాక్షిగా, చూశాం. అత్యధిక పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ‘అడకత్తెరలో పోకచెక్క’ పరిస్ధితిని కాస్త చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి ప్రధానంగా రెండు రకాల పన్నుల ద్వారా ప్రజల నుండి ఆదాయం సమకూరుతుంది. ఒకటి ప్రత్యక్ష పన్నులు: ఆదాయ పన్ను, కార్పొరేట్ల లాభాలపై పన్నులు. రెండవది,…

బడ్జెట్ 24-25: ఆదాయ పన్నులో నలుసంత ఉపశమనం!

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు అనగా జులై 23 తేదీన 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఎప్పటి లాగానే కార్పోరేట్ సూపర్ ధనిక వర్గాలకు రాయితీలు ప్రకటించిన ఆర్ధిక మంత్రి మధ్య తరగతి ఉద్యోగులకు మాత్రం నాలుగు మెతుకులు విధించారు. ప్రస్తుతం రెండు రకాల ఆదాయ పన్ను విధింపును ఉద్యోగులు కలిగి ఉన్నారు. ఒకటి ఓల్డ్ రెజిం, రెండు కొత్త రెజిం. రెండేళ్ళ క్రితం కొత్త రెజిం…