బడ్జెట్ 2011-12 -సామాన్యుడికి మొండిచేయి, మార్కెట్ కి అభయ హస్తం
భారత ప్రభుత్వ ఆర్ధిక నడక, మార్కెట్ ఎకానమీ వైపుకు వడివడిగా సాగిపోతోంది. బహుళజాతి సంస్ధల నుండి మధ్య తరగతి ఉద్యోగి వరకు ఎదురు చూసిన “బడ్జెట్ 2011-12” ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 28, 2011 తేదీన పార్లమెంటులో ఆవిష్కరించారు. ఎప్పటిలానే యూనియన్ బడ్జెట్ సామాన్యుడిని పట్టించుకుంటున్నట్లు నటిస్తూ, మార్కెట్ లో ప్రధాన పాత్రధారులైన స్వదేశీ ప్రైవేటు పెట్టుబడిదారుల నుండి విదేశీ బహుళజాతి సంస్ధల వరకు భారత దేశ కార్మికులూ, రైతులూ, ఉద్యోగుల రెక్కల…