నేనే జులియన్! అంతర్జాతీయ యోధుడి కోసం బ్రిటిషర్ల నిరసనలు -ఫోటోలు
మహా మహులుగా, తలపండిన రాజకీయ పోరాట యోధులుగా, వ్యవస్ధలను నడిపించే దేశ నాయకులుగా, ఆర్ధిక చిక్కుల పరిష్కర్తలుగా ఫోజులు కొట్టే దేశ దేశాల నాయకమ్మన్యులు సైతం అమెరికా ధూర్త రాజ్యం ముందు సాగిలపడి సలాములు కొడుతున్న పాడు కాలం ఇది. సమస్త భూగోళాన్ని క్షణమాత్రంలో భస్మీ పటలం చేసే అణ్వస్త్ర శస్త్రాల బలిమితో విరగబడుతున్న అంకుల్ శామ్ దేశ దేశాల్లో సాగించిన రహస్య వికృత క్రీడలని, ‘వికీలీక్స్’ ద్వారా ప్రపంచ ప్రజల ముందు ఆరబోసిన డిజిటల్ యోధుడికి…
