జపాన్ పాలపొడి డబ్బాల్లో రేడియేషన్

జపాన్ లో అతి పెద్ద ‘ఆహార పధార్ధాలు, తిను బండారాలు’ తయారీదారు మేజి కో కంపెనీ తాను సరఫరా చేసిన నాలుగు లక్షల పాల పొడి డబ్బాలను వెనక్కి పిలిపించుకుంటోంది. జపాన్ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం నుండి విడుదలైన రేడియేషన్ ఆనవాళ్ళు పాలపొడి డబ్బాలలో కనిపించడంతో కంపెనీ అర్జెంటుగా డబ్బాలను వెనక్కి పిలిపించుకుంటోంది. ఎన్ని డబ్బాలు వినియోగదారుల వద్దకు చేరుకున్నాయో తమకు తెలియదని కంపెనీ చెప్పింది. అయితే ఆందోళనలో ఉన్న కస్టమర్ల నుండి పెద్ద ఎత్తున…