తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసిన కావూరి వ్యాఖ్యలు

బుధవారం నాడు తెలంగాణ లాయర్లు తనకు వినతి పత్రం ఇవ్వడానికి తన ఇంటికి వచ్చిన సందర్భంగా ఏలూరు ఎం.పి కావూరి, తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలంగాణ + సీమాంధ్ర = ఆంధ్ర ప్రదేశ్ ఎం.పిలు, ఎం.ఎల్.ఏలు, ఎం.ఎల్.సిలపై విరుచుకు పడటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా పరిణామాలు ఒకింత వేగం పుంజుకోవడానికి దోహదం చేసింది. గురువారం జరిగిన, జరుగుతున్న పరిణామలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ లాయర్లు తమ ఇంటిని ముట్టడించారని కావూరి ఆరోపణ. కాదు,…

తిరుగుబాటు ప్రాంతాలపై గడ్డాఫీ సైనికుల దాడి, తిప్పికొట్టామంటున్న తిరుగుబాటుదారులు

  తిరుగుబాటు మొదలయ్యాక మొట్టమొదటిసారి గడ్డాఫీ తిరుగుబాటు ప్రాంతాలపై తన సైన్యంపై దాడి చేశాడు. ఈ దాడిని తిప్పికొట్టామని తిరుగుబాటుదారులు చెబుతున్నారు. కానీ తిరుగుబాటుకు కేంద్రంగా ఉన్న బెంఘానీ పట్టణం సమీపంలోని ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గడ్డాఫీ వర్గాలు చెబుతున్నాయి. తిరుగుబాటు వర్గాలు కూడా మొదట గడ్డాఫీ పక్షం దాడి విజయవంతం అయిందని చెప్పినప్పటికీ ఆ తర్వాత వారిని మళ్ళీ వెనక్కి తరిమినట్లు ప్రకటించారు. ఆయిల్ ఉత్పత్తిని బైటికి సరఫరా చేయటానికి ప్రధాన టెర్మినల్ గా ఉన్న…

లిబియాపై ఆంక్షలను ఆమోదించిన భద్రతా సమితి

ఐక్యరాజ్య సమితిలో శక్తివంతమైన సంస్ధ ఐన భద్రతా సమితి లిబియా పై ఆంక్షలు విధిస్తూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అమోదించింది. దానితో పాటు లిబియా పౌరులపై సైనికులు పోలీసులచేత విమాన దాడులు చేసినందుకు గడ్డాఫీపై “మానవతపై నేరపూరిత దాడులు” (క్రైమ్స్ ఎగైనెస్ట్ హ్యూమానిటీ) చట్టం కింద విచారణ జరపాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు సిఫారసు చేస్తూ ఆమోదించింది. అటువంటి సిఫారసు తర్వాత తమను కూడా ఇబ్బందుల్లోకి నెడుతుందని కొంతమంది సంశయించినప్పటికీ చివరికి ఆమోదముద్ర వేశారు.  చైనా అభిప్రాయంపై అనుమానాలు…

మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్యునీషియా ప్రజల భారీ ప్రదర్శన

  ప్రజల తిరుగుబాటుతో దేశం వదిలి పారిపోయిన ట్యునీషియా మాజీ అధ్యక్షుడు బెన్ ఆలీ మద్దతుదారులే తాత్కాలిక ప్రభుత్వం నడుపుతుండడంతో మొదటినుండి నుండి అసంతృప్తితో ఉన్న ట్యునీషియా ప్రజలు తాత్కాలిక ప్రధాన మంత్రి మహమ్మద్ ఘన్నౌచీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజధాని ట్యునీస్ లో భారీ ప్రదర్శన నిర్వహించారు. బెన్ ఆలీ ప్రభుత్వంలో ఉన్నవారెవరూ ప్రభుత్వంలో ఉండకూడదని ప్రజలు మాజీ అధ్యక్షుడు సౌదీ అరేబియా పారిపోయిన దగ్గర్నుండీ డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ…

లిబియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం, ఆంక్షలు విధించిన అమెరికా

  లిబియాలో గడ్డాఫీ మద్దతుదారులకూ వ్యతిరేకులకూ మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్నది. గడ్డాఫీ వ్యతిరేకులు క్రమంగా రాజధాని ట్రిపోలిని సమీపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ట్రిపోలీ పైనే ఇప్పుడు అటు ఆందోళనకారులూ, ఇటు గడ్డాఫీ ప్రభుత్వ బలగాలూ కేంద్రీకరించాయి. రాజధాని ఆందోళనకారుల వశం కాకూడదని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా ట్రిపోలీని పట్టుకొని గడ్డాఫీనీ అతని అనుకూలురనూ తరిమివేయాలని తిరుగుబాటుదారులు చూస్తున్నారు. గడ్డాఫీ వ్యతిరేక తిరుగుబాటుకు ఒసామా బిన్ లాడెన్ పూర్తి మద్దతు ఉందని గడ్డాఫీ ప్రకటించాడు. ముస్లిం తీవ్రవాదులుగా అమెరికా ముద్ర…

గరిష్ట స్ధాయికి ఆయిల్ ధరలు, షేర్ మార్కెట్ కు భారీ నష్టాలు

  ఇండియా షేర్ మార్కెట్లు గురువారం భారీ స్ధాయిలో నష్ట పోయాయి. అసలే అధిక ద్రవ్యోల్బణం, వరుసగా చుట్టుముడుతున్న అవినీతి ఆరోపణల కారణంగా కొత్త సంవత్సరం ప్రారంభం నుండీ ఒడిదుడుకులకు లోనవుతున్న భారత షేర్లు లిబియా ఆందోళనలు ఆశనిపాతంగా పరిణమించాయి. పదహారు నెలల గరిష్ట స్ధాయిలో నష్టాలను నమోదు చేశాయి. బోంబే స్టాక్ ఎక్ఛేంజ్ 546 పాయింట్లు (3 శాతం) నష్టపోయి 17,632 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ 175 పాయింట్లు (3.2…

పతనం బాటలో గడ్డాఫీ ప్రభుత్వం, ప్రపంచ దేశాల మధ్య విభేదాలు?

  కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ రోజు రోజుకీ ఒంటరి అవుతున్నాడు. విదేశీ రాయబారుల్లో చాలామంది గడ్డాఫీకి ‘బై’ చెప్పేశారు. ప్రజలపై హింస ఆపమని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులవి న్యాయమైన్ డిమాండ్లు, వాటిని ఒప్పుకొని దిగిపో అని సలహా ఇస్తున్నారు. గడ్డాఫీ అనుకూల సైనికులు వీధుల్లో జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకూ 1,000 మంది పౌరులను చనిపోయారని ఇటలీ విదేశాంగ మంత్రి ఫ్రాట్టిని ప్రకటించాడు. వ్యాపార సంబంధాల వలన లిబియాలో ఉన్న తమ పౌరులను అక్కడినుండి ఖాళీ చేయించడానికి త్వరపడుతున్నారు.…

గడ్డాఫీ చేజారుతున్న లిబియా, లిబియానుండి వెళ్ళిపోతున్న విదేశీయులు

  65 లక్షల జనాభా గల ఎడారి దేశం లిబియా క్రమంగా గడ్డాఫీ చేజారుతోంది. విదేశాల్లో లిబియా తరపున నియమించబడిన రాయబారులు ఒక్కొక్కరు గడ్డాఫీకి ఎదురు తిరుగుతున్నారు. సైనికులు గడ్డాఫీకి వ్యతిరేకంగా ఆందోళనకారుల్లో చేరిపోతున్నారు. వ్యతిరేకులుగా మారిన సైనిక బ్యారక్ లపై ప్రభుత్వ దళాలు విమానాలనుండి బాంబు దాడులు చేస్తున్నారు. హింసాత్మకంగా మారుతున్న లిబియానుండి విదేశీయులు తమ తమ స్వస్ధలాలకు వెళ్ళిపోతున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు విమానాల ద్వారా, ఓడల ద్వారా తమ దేశీయులను వెనక్కి రప్పించుకుంటున్నాయి.…

బలహీన పడుతున్న గడ్డాఫీ, వదిలి వెళ్తున్న మద్దతుదారులు

  42 సంవత్సరాల నుండి లిబియాను ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలిన కల్నల్ మహమ్మద్ గడ్డాఫీని మద్దతుదారులు ఒక్కొక్కరు వదిలి ఆందోళనకారులకు మద్దతు తెలుపుతుండడంతో క్రమంగా బలహీన పడుతున్నాడు. రెండు తెగలు కూడా ఆందోళనకారులకు మద్దతు తెలిపాయి. ఆందోళనకారులపై హింసను ప్రయోగించడాన్ని ఆ తెగల పెద్దలు తప్పు పట్టారు. లిబియాలో అది పెద్ద తెగ “వార్ఫ్లా” కూడా ఆ తెగల్లో ఉండటం గమనార్హం. లిబియా తరపున ఇండియా కు రాయబారిగా ఉన్న అలీ అల్-ఎస్సావీ భద్రతా దళాల దాడులను, కాల్పులను…

బహ్రెయిన్ ఆందోళనకారులపై ఉక్కుపాదం

  మరిన్ని ప్రజాస్వామిక హక్కుల కోసం డిమాండ్  చేస్తున్న ఆందోళనకారులపై బహ్రెయిన్ ప్రభుత్వం కఠినంగా అణచివేస్తున్నది. టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ ఛార్జి చేయటమే కాకుండా కాల్పులు కూడా జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు చనిపోయారు. మరొకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వంద మందికి పైగా గాయపడ్డారు. హెచ్చరికలేమీ లేకుండా లాఠీ చార్జీ చేసి కాల్పులు జరిపినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. శాంతి బధ్రతల కోసం చర్యలు అనివార్యమయ్యాయనీ, చర్చల ద్వారా నచ్చ జెప్పటానికి అన్ని ద్వారాలు మూసుకు…

అల్జీరియా, యెమెన్ లలో ప్రదర్శకులను చెదరగొట్టిన ప్రభుత్వాలు

ఈజిప్టులో ప్రజాందోళనల ధాటికి తలొగ్గి ముబారక్ అధికారం త్యజించటాన్ని స్ఫూర్తిగా తీసుకున్న అల్జీరియా, యెమన్ ల పౌరులు తమ నియంతృత్వ ప్రభువులు సైతం దిగి పోవాలని డిమాండ్ చేస్తూ ఆయా రాజధానుల్లో శనివారం  ప్రదర్శనలు నిర్వహించారు. అయితే ముందునుండే అప్రమత్తతతో ఉన్న అక్కడి ప్రభుత్వాలు పోలీసులు, సైన్యాలతొ పాటు తమ మద్దతుదారులను కూడా ఉసిగొల్పి ప్రదర్శనలు పురోగమించకుండా నిరోధించ గలిగింది. “బౌటెఫ్లికా వెళ్ళిపో” -అల్జీరియా ప్రదర్శకులు అల్జీరియా రాజధాని అల్జీర్స్ లో మొహరించి ఉన్న పోలీసులకు భయపడకుండా…