శనివారం జపాన్ అణువిద్యుత్ ప్లాంట్లకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
భూకంపం, సునామీల దెబ్బకు పేలిపోయి అణు ధార్మికత వెదజల్లుతూ ప్రమాదకరంగా పరిణమించిన జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు రియాక్టర్లకు శనివారం విద్యుత్ పునరుద్ధరించగలమని జపాన్ తెలిపింది. భూకంపం సునామీల వలన రియాక్టర్లకు విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో రియాక్టర్లలోని కూలింగ్ వ్యవస్ధ పని చేయడం మానివేసింది. దానితో రియాక్టర్లలోని ఇంధన కడ్డీలు వేడెక్కి కరిగిపోయే పరిస్ధితి తలెత్తింది. వాటిని చల్లబరచడానికి జపాన్ రెండు రోజులనుండి వాటర్ కెనాన్ ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా సముద్రపు నీటిని…