అరాఫత్ ది హత్యే, శాస్త్రవేత్తల నిర్ధారణ
పాలస్తీనా స్వాతంత్రోద్యమ నాయకుడు యాసర్ అరాఫత్ సహజ కారణాలతో చనిపోలేదని, ఆయనపై విష ప్రయోగం జరిగిందని దాదాపు నిర్ధారణ అయింది. అరాఫత్ సమాధి నుండి వెలికి తీసిన అవశేషాల్లో అణు ధార్మిక పదార్ధం పోలోనియం-210 భారీగా ఉన్నట్లు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అరాఫత్ ను పూడ్చిపెట్టిన 8 యేళ్ళ తర్వాత కూడా పోలోనియం పదార్ధం ఉండడాన్ని బట్టి ఆయనపై విష ప్రయోగం జరిగిందన్న వాదనలో నిజం ఉన్నట్లేనని స్విస్ శాస్త్రజ్ఞుల నివేదిక పేర్కొంది. యాసర్ అరాఫత్ హత్యలో…
