ఒక ఊరేగింపుకి ఇంత నిర్బంధమా?

పశ్చిమ దేశాల ప్రజాస్వామిక ముసుగులు ఒక్కొక్కటీ తొలగిపోతున్న నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా తానూ తగ్గేది లేదని చాటుకుంటోంది. ఒకే ఒక ఊరేగింపుకు, అది కూడా రాజ్యాంగం గ్యారంటీ చేసిన భావ ప్రకటనా స్వేచ్ఛకు అనుగుణంగా మాత్రమే తలపెట్టిన ఊరేగింపుకు, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని రీతిలో పది రాష్ట్రాలను జిల్లాలను పోలీసు కాపలా మధ్య దిగ్బంధించిన తీరు అత్యంత హేయం. బస్సులు, రైళ్లు, మెట్రో రైళ్లు అన్నీ రద్దు చేసి, స్కూళ్ళు,…

మీరు లిబియన్లపై బాంబులేసుకొండి, మేం మా ప్రజల్ని చంపుకుంటాం -అమెరికా, సౌదీఅరేబియాల అనైతిక ఒప్పందం

ఒకరి దారుణాలను మరొకరు ఖండించుకోకుండా అమెరికా, సౌదీ అరేబియాల మధ్య అనైతిక ఒప్పందం సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ నిజం అరబ్ ప్రపంచానికి చెందిన వార్తా సంస్ధలకు ఎప్పుడో ఉప్పందింది. అరబ్, ముస్లిం ప్రపంచంలోని ప్రముఖ బ్లాగర్లు బైట పెట్టే వరకూ ఈ దారుణం ప్రపంచానికి తెలియలేదు. లిబియా పౌరులను గడ్డాఫీ సైన్యాలు చంపుతున్నాయంటూ కాకి గోల చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు తదితర పశ్చిమ దేశాలు బహ్రెయిన్, యెమెన్ ల ప్రభుత్వాధిపతులు అక్కడ…

చైనాలో ప్రదర్శనకు పిలుపు, ఉక్కుపాదం మోపిన చైనా పోలీసులు

  అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక హక్కుల కోసం చెలరేగుతున్న ప్రజా ఉద్యమాలు చైనా ప్రభుత్వానికి సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. ఆదివారం ట్యునీషియా తరహాలో చైనాలోని బీజింగ్, షాంగై నగరాల్లో జాస్మిన్ గేదరింగ్ జరపాలని అమెరికానుండి నిర్వహించబడుతున్న ఒక వెబ్ సైట్ చేసిన ప్రచారానికి ఎవరూ గుమిగూడకుండా చైనా పోలీసులు కట్టుదిట్టం చేశారు. విదేశీ విలేఖరులను కూడా వదల కుండా కెమెరాలను లాక్కొని ఫోటోలను తొలగించారు. ప్రదర్శన కోసం పిలుపునిచ్చిన ప్రాంతంలో ఎవరూ ఎక్కువ సేపు ఆగకుండా చీపుర్లతో…

బహ్రెయిన్ ఆందోళనకారులపై ఉక్కుపాదం

  మరిన్ని ప్రజాస్వామిక హక్కుల కోసం డిమాండ్  చేస్తున్న ఆందోళనకారులపై బహ్రెయిన్ ప్రభుత్వం కఠినంగా అణచివేస్తున్నది. టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ ఛార్జి చేయటమే కాకుండా కాల్పులు కూడా జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు చనిపోయారు. మరొకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వంద మందికి పైగా గాయపడ్డారు. హెచ్చరికలేమీ లేకుండా లాఠీ చార్జీ చేసి కాల్పులు జరిపినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. శాంతి బధ్రతల కోసం చర్యలు అనివార్యమయ్యాయనీ, చర్చల ద్వారా నచ్చ జెప్పటానికి అన్ని ద్వారాలు మూసుకు…