ట్యునీషియా ఆపద్ధర్మ అధ్యక్షునికి మరిన్ని అధికారాలు
ప్రజల తిరుగుబాటుతో దేశం విడిచి పారిపోయిన పాత అధ్యక్షుడి స్ధానంలో తాత్కాలిక (ఆపద్ధర్మ) అధ్యక్షునిగా అధికారాన్ని చేపట్టిన ఫోద్ మెబజాకి ఇప్పుడు పార్లమెంటుతో సంబంధం లేకుండా డిక్రీతో పాలించే అధికారాలను సంక్రమింపజేశారు. మెబాజా పదవీచ్యుతుడైన పాత అధ్యక్షుడు బెన్ ఆలీకి సన్నిహితుడుగా పేరు పొందిన వ్యక్తి. బెన్ ఆలీ పాలనలో దాదాపు పదకొండు సంవత్సరాలపాటు ప్రధానిగా పని చేశాడు. పార్లమెంటుతో సంబంధం లేకుండా డిక్రీ ద్వారా పాలించ వచ్చు. సెనేట్ ఓటింగ్ ద్వారా అటువంటి అధికారాలను దఖలు…