పురుషాధిక్య సమాజంలో పురుషులపై జరిగే అన్యాయాలపై అవగాహన
మిత్రులొకరు పురుషులకు జరుగుతున్న అన్యాయం గురించి ఏమి చెబుతారు? అని అన్నా గారి గొడ్రాలి వ్యాఖ్యపైన నేను రాసిన పోస్టు కింద అడిగారు. దానికి సమాధానం రాశాను. అది పోస్టుగా చేయగల విషయం అని భావించి ఇక్కడ ఇస్తున్నా. * * * * స్త్రీలకు జరుగుతున్న అన్యాయం నేరుగా పురుషులనుండి జరుగుతుందని భావిస్తే ఈ అనుమానం రావడం సహజం. కాని వాస్తవం ఏమిటంటే, పురుషులకు, స్త్రీలపైన ఆధిపత్యం సమాజం ఇచ్చింది. అంటే సమాజం స్వభావాన్ని బట్టే…