పీస్ పైప్ లైన్ పై వేలాడుతున్న అమెరికా ఆంక్షల కత్తి
అమెరికా ఆంక్షల కత్తి వేలాడుతుండడంతో పాకిస్ధాన్-ఇరాన్ పీస్ పైప్ లైన్, నిధుల లేమితో సతమతమవుతోంది. ఇరాన్ సహజ వాయు నిక్షేపాలతో పాక్ ప్రజల అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ పైప్ లైన్ తలపెట్టి దశాబ్దం దాటిపోయింది. పాకిస్ధాన్ మీదుగా ఇండియాకి కూడా గ్యాస్ సరఫరా చేయడానికి పీస్ పైప్ లైన్ ను మొదట ఉద్దేశించారు. కానీ అమెరికా బెదిరింపులతో ఇండియా ఈ ప్రాజెక్టును వదులుకుంది. పాకిస్ధాన్ మాత్రం అమెరికా హెచ్చరికలను త్రోసిరాజని ముందుకు వెళుతోంది. గత మార్చి…
