వివరణ: టర్కీ సైనిక కుట్ర -అంకెల్లో..
కొన్ని గంటలలోనే, నిమిషాలు కాకుంటే, ఓటమితో ముగిసిపోయిన టర్కీ సైనిక కుట్ర పైన ప్రస్తుతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కుట్ర జరగడం వాస్తవమేనా అన్నది ప్రధాన అనుమానం. తామే “కుట్రతో” కుట్ర చేయించుకుని ఆ సాకుతో మరిన్ని నియంతృత్వ అధికారాలు తనకు తానే కట్టబెట్టుకునేందుకు టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ ప్రయత్నిస్తున్నాడని అనుమాన ప్రియుల అనుమానం. అమెరికా ప్రభుత్వ అధికారులు, వివిధ ఇంటలిజెన్స్ సంస్థల అధికారులు ఈ అనుమానాలను వ్యక్తం చేస్తున్న వారిలో ఉన్నారు.…