గాజా స్ట్రిప్‌: రక్తం ఓడుతున్న అరబ్బుల గాయం -పార్ట్ 2

Gaza people are forced to migrate throught the Gaza strip due to continous bombing by Israel military —–మాతృక అక్టోబర్ నెల సంచిక నుండి (రచన: సుమన) పార్ట్ 1 తరువాత భాగం……. బాల్ఫర్‌ డిక్లరేషన్‌ పశ్చిమాసియా చరిత్రలో బాల్ఫర్‌ డిక్లరేషన్‌ అత్యంత ప్రాముఖ్యత కలిగినది. వాస్తవానికి ప్రాధాన్యతగానీ, చట్టబద్ధత గానీ లేని ఒక చిన్న లేఖ బాల్ఫర్‌ డిక్లరేషన్‌కి పునాది. దీనిపై బ్రిటిష్‌ పార్లమెంటులో చర్చ కూడా జరిగింది లేదు.…

ఇజ్రాయెల్ పై ఇరాన్ ముందస్తు దాడి? రష్యా మద్దతు?

అక్టోబర్ 1 తేదీన ఇరాన్ దాదాపు 180 కి పైగా మిసైళ్లతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనీయేను ఇరాన్ లో ఉండగా మిసైల్ దాడితో ఇజ్రాయెల్ హత్య చేసింది. హమాస్ సుప్రీం నేత హసన్ నాసరల్లా తో పాటు మరో 7 గురు హిజ్బోల్లా టాప్ కమాండర్లు బీరూట్ లోని బంకర్లలో సమావేశమై ఉండగా వరుస మిసైల్ దాడితో ఇజ్రాయెల్ హత్య చేసింది. ఈ హత్యలకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ రాజధాని…

అమెరికా కాంగ్రెస్ లో నెతన్యాహు చెప్పిన కొన్ని అబద్ధాలు!

Netanyahu addressing U.S. Congress on July 24, 2024 అమెరికా తోక ఇజ్రాయెల్ అన్న సంగతి ఈ బ్లాగ్ లో చాలా సార్లు చెప్పుకున్నాం. అమెరికా తోకకి ఒక ప్రత్యేకత ఉంది. అమెరికాకి ఎంతయితే దుష్టబుద్ధితో కూడిన మెదడు ఉన్నదో దాని తోక ఇజ్రాయెల్ కి కూడా అంతే స్థాయి దుష్ట బుద్ధితో కూడిన మెదడు ఉండడం ఆ ప్రత్యేకత. ఒక్కోసారి అమెరికా తలలో ఉన్న మెదడు కంటే దాని తోకలో ఉన్న మెదడుకే ఎక్కువ…

ఇరాన్ కి యుద్ధం కావాలి, అందుకే…

ఇరాన్ కి యుద్ధం కావాలి. ఇరాన్ కి యుద్ధమే ఆహారం. కానీ అమెరికాకి శాంతి కావాలి. శాంతి లేనిదే అమెరికా బ్రతకలేదు. ప్రపంచ శాంతి అమెరికాకి చాలా చాలా ముఖ్యం. కానీ ఇరాన్ తన యుద్ధ కాంక్షతో అమెరికాకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. కావాలంటే కింద సాక్ష్యం చూడండి! అమెరికా ప్రపంచ శాంతి కోసం తపన పడుతూ, ప్రపంచం నిండా సైనిక స్థావరాలను నిర్మించుకుంది. ఇరాన్ దేశం ప్రపంచ శాంతి కోసం అమెరికాతో సహకరించకుండా…

ఈజిప్టు: ట్రోజాన్ హార్స్ (2)

యోం కిప్పుర్ వార్ 1973 అక్టోబర్ లో సిరియా, ఈజిప్టులు ఓ పక్కా, ఇజ్రాయెల్ మరో పక్కా  జరిగిన యుద్ధమే ‘యోం కిప్పుర్’ వార్. 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించిన గోలన్ హైట్స్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడం సిరియా లక్ష్యం. అలాగే ఇజ్రాయెల్ ఆక్రమించిన తన భూభాగం సినాయ్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఈజిప్టు లక్ష్యం. 1967 ఆరు రోజుల యుద్ధంలో ఓటమి ద్వారా కోల్పోయిన ప్రతిష్టను మరో యుద్ధంలో విజయం ద్వారా తిరిగి…

ఈజిప్టు: పాలస్తీనా ప్రతిఘటనా శిబిరంలో చొరబడ్డ  ట్రోజాన్ హార్స్! (1)

Middle East & North Africa (MENA) ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా (మధ్య ప్రాచ్యం) ప్రాంతాలలో విస్తరించిన అరబ్బు దేశాలలో ఈజిప్టుకి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. 5,000 సంవత్సరాలకు పూర్వమే ఆవిర్భవించిన ఈజిప్టు నాగరికత, 6 బిసి సం. లో అఖేమినీడ్ (మొదటి పర్షియన్ వంశం) సామ్రాజ్యం వశం అయ్యే వరకూ స్థానికుల పాలనలోనే కొనసాగింది. ఆ తర్వాత గ్రీకులు, రోమన్లు, బైజంటైన్లు, ఒట్టోమన్ లు ఈజిప్టును ఒకరి తర్వాత మరొకరు ఆక్రమించుకున్నారు. ఒట్టోమన్ రాజుల…

మైలు రాయి: ఇరాన్, ఇరాక్ మధ్య మిలట్రీ ఒప్పందం!

పశ్చిమాసియాలో మరో ముఖ్య సంఘటన చోటు చేసుకుంది. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా మసలిన ఇరాన్, ఇరాక్ లు కీలకమైన మిలట్రీ ఒప్పందం చేసుకున్నాయి. ‘ఉగ్రవాదం మరియు తీవ్రవాదం’ లకు వ్యతిరేకంగా పోరాటం చేసే దిశగా తాము ఈ ఒప్పందం చేసుకున్నామని ఇరు దేశాలు ప్రకటించాయి. ఈ మేరకు ఇరాన్ రక్షణ మంత్రి హోస్సేన్ దేఘన్, ఇరాక్ రక్షణ మంత్రి ఇర్ఫాన్ ఆల్-హియాలి లు అవగాహన పత్రంపై సంతకాలు చేశారు. ఉగ్రవాదం, తీవ్రవాదం… ఈ పదాలు దేశాల ప్రభుత్వాలకు…

నాటోతో తలపడుతున్న టర్కీ ప్రధాని?

  టర్కీలో జులై 15 నాటి మిలట్రీ కుట్రలో పాత్ర పోషించిన వారి పైన లేదా పాత్ర పోషించారని అనుమానించబడుతున్న వారి పైన విరుచుకుపడటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. కుట్రలో పాల్గొన్నారన్న అనుమానంతో 1700 మంది వరకు పోలీసులను కొద్దీ రోజుల క్రితం సస్పెండ్ చేయడమో లేదా డిస్మిస్ చేయడమో చేసిన టర్కీ ప్రధాని రెసిపీ తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా నాటో దేశాలలోని రాయబారులను కూడా టార్గెట్ చేసుకున్నాడు. నాటో సభ్య దేశాలలో మిలట్రీ కూటమి రాయబారులుగా…

ఇజ్రాయెల్: యూదు రాజ్యంగా చస్తే గుర్తించం -అరబ్ లీగ్

  ఇజ్రాయెల్ దేశాన్ని యూదు రాజ్యంగా గుర్తించాలన్న ఇజ్రాయెల్ డిమాండ్ ని అరబ్ లీగ్ దేశాలు ఖరాఖండీగా నిరాకరించాయి. యూదు రాజ్యంగా గుర్తిస్తే పాలస్తీనా అరబ్ ల పరిస్ధితి ఏమిటని ప్రశ్నించాయి. పాలస్తీనాలో యూదు సెటిల్మెంట్ల నిర్మాణాన్ని ముందు నిలిపేయాలని డిమాండ్ చేశాయి. కువైట్ లో ముగిసిన అరబ్ లీగ్ సమావేశాల అనంతరం అరబ్ లీగ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా శాంతి చర్చలు ముందుకు సాగకపోవడానికి ఏకైక కారణం ఇజ్రాయెల్ మాత్రమే అని…

సూడాన్ ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాల దాడులు

దురహంకార ఇజ్రాయెల్ తమ రాజధాని నగరంపై బాంబు దాడులు చేసిందని సూడాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఫైటర్ జెట్ యుద్ధ విమానాలతో దాడి చేసి మందుగుండు ఫ్యాక్టరీని ధ్వంసం చేసిందని సూడాన్ సమాచార మంత్రి అహ్మద్ బెలాల్ ఒస్మాన్ బుధవారం తెలిపాడు. పౌరనివాస ప్రాంతాలపై అక్టోబర్ 23 తేదీన  ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందనీ, పేలుడులో ఇద్దరు పౌరులు చనిపోయారనీ మంత్రి తెలిపాడు. దాడులకు గురయిన చోట లభ్యమైన రాకెట్ శిధిలాల ద్వారా…

పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం, చర్చలకు సౌదీ చేరిన ఇరాన్ అధ్యక్షుడు

ఆయిల్ నిల్వలతో సుసంపన్నమైన పశ్చిమాసియా (మధ్య ప్రాచ్యం) ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత స్ధాయి బృందంతో సహా ఇరాన్ అధ్యక్షుడు మహ్మౌద్ అహ్మది నెజాద్ చర్చల నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నాడు. సౌదీ రాజు ‘అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్’ వ్యక్తిగతంగా అహ్మదీ నెజాద్ ను ఆహ్వానించడం మరో ముఖ్య పరిణామం. అహ్మది నెజాద్ తో సమావేశానికి సౌదీ అరేబియా ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నదీ ఈ అంశం తెలియజేస్తోంది. సౌదీ అరేబియా, కతార్, టర్కీ ల…