రెండు వారాల దీక్షకు ఒప్పందం, గడువు ముగిశాక సమీక్ష

జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటు ముందుకి తేవాలన్న డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష తలపెట్టిన అన్నా హజారే దీక్ష గడువు విషయంలో బుధవారం అర్ధరాత్రి దాటాక కూడా చర్చలు జరిగాయి. మూడు రోజుల గడువునుండి ఐదురోజులకూ, అటు పిమ్మట వారానికీ గడువు పెంచినప్పటికీ హజారే బృందం తిరస్కరించడంతో పోలీసులు అన్నా బృందానికి నచ్చజెప్పటానికి తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి రెండు వారాల పాటు దీక్షను అనుమతించడానికి పోలీసులు, అన్నా హజారే బృందం అంగీకరించారు. అయితే రెండు వారాల…