మార్కెట్లో ‘బై చైనా, సెల్ ఇండియా’ సెంటిమెంట్!

గోల్డెన్ వీక్ సెలవులు (అక్టోబర్ 1 నుండి 7 వరకు) ముగిసిన అనంతరం మంగళవారం చైనా స్టాక్ మార్కెట్లు వ్యాపారం నిమిత్తం తెరుచుకోనున్న నేపధ్యంలో మార్కెట్లో “బై చైనా, సెల్ ఇండియా” సెంటిమెంట్ జోరందుకుంది. గత 6 ట్రేడింగ్ రోజుల్లో 30 షేర్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఏకంగా 4,786 పాయింట్లు కోల్పోవడంతో బేర్ సెంటిమెంట్ బలంగా ఉన్నదనీ ఎఫ్.ఐ.ఐ లు ఇండియన్ షేర్ మార్కెట్ల నుండి చైనా స్టాక్ మార్కెట్ కు తరలిపోయేందుకు సిద్ధంగా…

వరుసగా నాల్గవరోజు నష్టపోయిన భారత షేర్ మార్కెట్లు

భారత షేర్ మార్కెట్లు వరుసగా నాల్గవ రోజు కూడా నష్టపోయాయి. బి.ఎస్.ఇ సెన్సెక్స్ 12.32 పాయింట్లు (0.07 శాతం) నష్టపోయి 18197.20 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 5.75 పాయింట్లు (0.1 శాతం) నష్టపోయి 5482 వద్ద ముగిసింది. ఫండ్లు, మదుపుదారులు రియాల్టీ, మెటల్, ఆయిల్ & గ్యాస్, విద్యుత్ రంగాల షేర్లను అమ్మడంతో షేర్ మార్కెట్లు నష్టాలకు గురయ్యాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నుండి అందుతున్న బలహీన సంకేతాలు, భారత దేశంలో ద్రవ్యోల్బణ కట్టడికి మరిన్ని…

రెండో రోజూ కొనసాగిన ఇండియా షేర్ల పతనం, ఆశలన్నీ బడ్జెట్ పైనే

సోమవారం లాభాల్లో ముగిసిన ఇండియా షేర్ మార్కెట్లు మంగళ, బుధ వారాల్లో మళ్ళీ నష్టాల బాట పట్టాయి. ఇటీవలి వరకూ ఈజిప్టు ఆందోళనలు ప్రపంచ షేర్ మార్కెట్లపై ప్రభావం చూపగా ప్రస్తుతం లిబియా పరిణామాలు ప్రభావం చూపుతున్నాయి. ప్రజాందోళనలు ఆయిల్ ఉత్పత్తి చేసే ఇతర దేశాలకు సైతం విస్తరించవచ్చనే భయం నెలకొనడంతో ఆయిల్ ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. దానితో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో బ్యాంకుల షేర్లు మార్కెట్ పతనానికి దోహదం చేశాయి. 30 షేర్ల…