ఇండియా ప్రధాని సరే, బి.జె.పి ప్రధాని ఎవరు? -కార్టూన్

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఇటీవల జరిగిన బి.జె.పి అత్యున్నత స్ధాయి సమావేశంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా నియమించబడ్డారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ తన సొంత నాయకత్వ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారని, అందులో నరేంద్ర మోడి ఒకరని పత్రికలు తెలిపాయి. ఆరు సంవత్సరాల క్రితం బి.జె.పికి రాజ్ నాధ్ సింగ్ అధ్యక్షుడుగా ఉన్నపుడే మోడిని పార్లమెంటరీ బోర్డు నుండి తొలగించారని, అదే వ్యక్తి నేతృత్వంలో మోడిని మళ్ళీ బి.జె.పి తన పార్లమెంటరీ…

బీహార్ పాఠశాల గ్రంధాలయాల్లొ అర్.ఎస్.ఎస్ పుస్తకాలు -జె.డి(యు) రెబెల్స్

తనను తాను అసలైన సెక్యులరిస్టుగా చెప్పుకునే నితీష్ కుమార్ బీహార్ పాఠశాలల కోసం ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతాలను బోధించే పుస్తకాలను కొనడానికి అనుమతించాడని జనతా దళ్ (యునైటెడ్) పార్టీ తిరుగుబాటు నాయకుడు ఒకరు ఆదివారం వెల్లడించాడు. మతన్మోదాన్ని, విద్వేషాలనూ రెచ్చగొట్టే ఈ పుస్తకాలను వెంటనే పాఠశాలల గ్రంధాలయాలనుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశాడు. ప్రభుత్వ నిధులను ఖర్చు చేసి ఆర్.ఎస్.ఎస్ భావాల వ్యాప్తికి దోహదం చేసే పుస్తకాలను కొనుగోలు చేసి పాఠశాల పిల్లలకు అందుబాటులో ఉంచడం తగదని ఉపేంద్ర…