ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధం: రెండు వేలు దాటిన అమెరికన్ల చావులు

అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూటమి సాగిస్తున్న ‘ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధం’ లో అమెరికా సైనికుల చావులు 2,000 దాటిందని బి.బి.సి తెలిపింది. అయితే, స్వతంత్ర సంస్ధల లెక్కకూ, అమెరికా నాటో ల లెక్కకూ అమెరికా చావుల్లో ఎప్పుడూ తేడా ఉంటుంది. స్వతంత్ర సంస్ధ ‘ఐ కేజువాలిటీస్’ లెక్క ప్రకారం ఈ సంఖ్య 2,125 కి పైనే. తాలిబాన్ మిలిటెంట్ల చేతుల్లో అమెరికా సైనికులు మరణించారని వార్తా సంస్ధలు చెప్పినపుడు కొన్ని సార్లు ఆ వార్తలను అమెరికా…

మూడు రోజుల్లో 24 మంది ఆఫ్ఘన్ పౌరుల్ని చంపేసిన నాటో బలగాలు

గత మూడు రోజుల్లోనే దేశవ్యాపితంగా జరిపిన దాడుల్లో 24 మంది అమాయక ఆఫ్ఘన్ పౌరులను నాటో దురాక్రమణ బలగాలు చంపేశాయి. మరింతమందిని గాయపరిచాయి. పాతిక మందిని చంపినందుకు రెండు రోజుల్లో సారీ చెబుతామని నాటో అధికారి చెప్పాడు. చనిపోయినవారిలో మహిళలు పిల్లలు ఉన్నారు. వాయవ్య ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న బాద్ఘిస్ రాష్ట్రంలో సోమవారం నాటో విమానాలు జరిపిన బాంబు దాడుల్లో ఐదుగురు మరణించారనీ, మరో 15 మంది గాయపడ్డారనీ ప్రెస్ టి.వి తెలిపింది. అయితే వాషింగ్టన్ పోస్ట్…

ఆఫ్ఘన్‌లో కొనసాగుతున్న ‘నాటో’ నరమేధం, పౌర నష్టంపై పచ్చి అబద్ధాలు, బుకాయింపులు

ఆఫ్ఘనిస్ధాన్‌లో అర్ధ రాత్రుళ్ళు గ్రామాలపై దాడి చేసి పౌరుల ఇళ్ళపై కాల్పులు జరిపి వారిని కాల్చి చంపడం కొనసాగుతోంది. టెర్రరిస్టు గ్రూపుల సమావేశం జరుగుతోందని చెప్పడం, పౌరుల ఇళ్ళపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడం, పౌరులను కాల్చి చంపి చనిపోయినవారు టెర్రరిస్టులను బుకాయించడం నాటో దళాలకు ముఖ్యంగా అమెరికా సైన్యానికి నిత్యకృత్యంగా మారింది. ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణను ప్రతి ఒక్క ఆఫ్ఘన్ దేశీయుడూ వ్యతిరేకిస్తున్నాడనీ, తమ దేశం నుండి అమెరికా సైనికులు తక్షణమే వెళ్ళిపోవాలని ప్రతీ ఆఫ్ఘన్ జాతీయుడు…