అబద్ధాలతో ‘పాక్ సైనికుల హత్యల’ను కప్పిపుచ్చుకుంటున్న అమెరికా

పాకిస్ధాన్ లో చెక్ పోస్టు వద్ద ఉన్న పాక్ సైనికులను 24 మందిని (28 మందని ‘ది టెలిగ్రాఫ్ చెబుతోంది) చంపి, మరో 13 మందిన గాయపరిచిన అమెరికా, తన దాడులను సమర్ధించుకోవడానికి అబద్ధాలను ప్రచారంలో పెడుతోంది. పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు అమెరికా చెబుతున్న అబద్ధాలను నిజాలుగా చెప్పడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. గోబెల్ ను ఎప్పుడో తలదన్నిని ఈ పడమటి పత్రికలు ఆర్ధికంగా నయా ఉదారవాద విధానాలకు అనుకూలంగా ప్రచారం చేస్తూ రాజకీయంగా అమెరికా, యూరప్…

అమెరికాపై ప్రతీకార చర్యలు తీవ్రం చేసిన పాక్, అమెరికా సారీ

పాకిస్ధాన్ గగన తలం లోకి మరోసారి జొరబడడమే కాకుండా, తాలిబాన్ పై పోరాడుతున్న 28 మంది పాక్ సైనికుల్ని అమెరికా హెలికాప్టర్లు చంపేయడంపైన పాకిస్ధాన్ లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. పాకిస్ధాన్ ప్రభుత్వం, మిలట్రీలు ప్రతీకార చర్యలను ముమ్మరం చేశాయి. ఆఫ్ఘనిస్ధాన్ పై చేస్తున్న దురాక్రమణ యుద్ధంలో పాక్ ఇస్తూ వచ్చిన సహకారం తగ్గించే వైపుగా పాక్ మిలట్రీ వేగంగా చర్యలు తీసుకుంటోంది. పాక్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోంది. శనివారం తెల్లవారు ఝామున 2 గంటలకు…