సునంద పుష్కర్ పోస్ట్ మార్టంలో యు.పి.ఏ ఒత్తిడి?

కేంద్ర మాజీ మంత్రి శశి ధరూర్ భార్య హఠాన్మరణం విషయంలో తాజాగా వివాదం రగులుతోంది. ఆమె మరణానికి కారణాలు తెలియజేసే పోస్ట్ మార్టం నివేదిక తయారీలో తనపై తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ ఆరోపించడంతో సంచలనం రేగుతోంది. డాక్టర్ ఆరోపణలను ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ అధికారులు హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించడంతో మరిన్ని అనుమానాలు కలగడానికి ఆస్కారం ఏర్పడింది. తన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్…

మోడి సుపరిపాలనా సూత్రాలు -కార్టూన్

“యెస్, సర్…” “గవర్నర్లు…” “ఎన్.జి.ఓ లు…” “… ఇంకా, హిందీలో రాయాలి!” “మరిన్ని స్టిక్-ఆన్ నోట్ లా, సర్?” “గరిష్ట (సు)పరిపాలన కోసం కాసిన్ని చిన్న చిన్న సవరణలు… అంతే…” *** ప్రధాని నరేంద్ర మోడి ఎన్నికల నినాదాల్లో ‘సుపరిపాలన’ (Good Governance) ఒకటి. యు.పి.ఏ ప్రభుత్వం మా చెడ్డదనీ తాను ప్రధాని అయ్యాక దేశ ప్రజలకు ‘సుపరిపాలన’ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని ఆయన ప్రచారం చేశారు. గుజరాత్ ప్రజలకు రుచి చూపించిన సుపరిపాలన…

రైల్వే ఛార్జీలు: మంచి రోజులా, ముంచే రోజులా?

‘మంచి రోజులు ముందున్నాయి’ అని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన ప్రధాని మోడి, అధికారంలోకి వచ్చాక, ‘ముందుంది ముసళ్ళ పండగ’ అని చాటుతున్నారు. సరుకు రవాణా ఛార్జీలతో పాటు ప్రయాణీకుల ఛార్జీలు కూడా వడ్డించిన మోడి ప్రభుత్వం ‘కఠిన నిర్ణయాలకు’ అర్ధం ఏమిటో చెప్పేశారు. రెండేళ్ల క్రితం రైలు సరుకు రవాణా ఛార్జీలు పెంచినపుడు అప్పటి ప్రధానికి లేఖ రాసి నిరసించిన మోడి ఇప్పుడు ఎవరి లేఖకు లొంగుతారు? ప్రయాణీకులపై 14.2 శాతం ఛార్జీల మోత మోగించిన మోడి…

కఠిన నిర్ణయాలు తప్పవు -మోడి

అనేశారు! ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడి ఆ కాస్త మాటా అనేశారు. ఆర్ధిక వ్యవస్ధను గాడిన పెట్టాలంటే కఠిన చర్యలు తప్పవని ప్రధాని మోడి స్పష్టం చేశారు. మోడీని, బి.జె.పినీ అదే పనిగా పొగుడుకుంటే ఏమీ ఒరగదనీ అసలు పనిలోకి దిగితే కొన్ని సెక్షన్ల ప్రజలకు కష్టం తప్పదని ఆయన ఉన్న మాట చెప్పేశారు. అధికార పీఠాన్ని అధిష్టించి నెల కూడా కాలేదు, అప్పుడే కఠిన చర్యలు అంటున్నారు మోడి. “ఆర్ధిక క్రమశిక్షణ తెచ్చుకోవాలంటే రాబోయే ఒకటి…

మోడీ పైనే బాబు ఎన్నికల హామీల భారం! -కార్టూన్

ఎన్నికల గెలుపు తాలూకు మత్తు నాయకులను ఇప్పుడిప్పుడే వదులుతున్నట్లుంది! కేంద్రంలో బి.జె.పి/మోడి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం సాధించిన విజయాలు మోడి, చంద్రబాబు నాయుడుల చలవే అని పత్రికలు ఘోషిస్తున్నాయి. మోడీయే లేకపోతే బి.జె.పికి ఈ గెలుపు దక్కి ఉండేది కాదని మామూలుగా మోడిని విమర్శించే పత్రికలు కూడా ఇప్పుడు అంగీకరిస్తున్నాయి. మోడి గాలి తుఫానులా తాకి కాంగ్రెస్ ని ఊడలతో సహా పెరిగివేసిందని, చంద్రబాబు పడిన పాదయాత్ర కష్టం టి.డి.పి ని తిరిగి అధికారంలోకి…

మోడి: భారతీయ మోషే! -కార్టూన్

భారత ప్రధాని నరేంద్ర మోడిని భారతీయ మోషే (మోజెస్) గా కార్టూనిస్టు చిత్రీకరించారు. ఎన్నికలకు ముందు మోడీకి ప్రచార సారధ్యం అప్పగించడం ద్వారా ప్రధాని పదవికి ఆయనే అభ్యర్ధి అని బి.జె.పి ప్రకటించినప్పుడు అలిగి తూలనాడిన పార్టీ సీనియర్లను మోడి తెచ్చిన టెన్ కమాండ్ మెంట్స్ ఫలకాలను మోసుకు తిరగడానికి ఎదురు చూస్తున్నవారిగా కేశవ్ చిత్రీకరించారు. మోడి కష్టాన్ని అనుభవించడానికి బి.జె.పి సీనియర్లు ఎదురు చూస్తున్నారని చురక అంటించారు. *** క్రైస్తవ పురాణంలో మోజెస్ కధ తెలుసా?…

ప్రమాణానికి ముందే ఆఫ్ఘన్ తో చర్చలు చేసిన మోడి

మాట్లాడితే ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లపై విద్వేషం వెళ్లగక్కే మోడి అభిమానులు, ప్రధానిగా మోడి తీసుకుంటున్న చర్యలను ఏ విధంగా అర్ధం చేసుకుంటారన్నదీ పరిశీలించాల్సిన విషయం. భారత దేశానికి శత్రు దేశాలయిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లతో సత్సంబంధాలను మీరు ఎలా కోరుకుంటారో అర్ధం కావట్లేదు అని ఒక హిందూత్వ అభిమాని ఈ బ్లాగ్ రచయితను ప్రశ్నించిన సంగతి ఇటీవలి విషయమే. అయితే మోడి ప్రధాన మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయకమునుపే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్ధాన్ రెండు దేశాలతోనూ చర్చలు…

దొడ్డి దారిన రిటైల్ ఎఫ్.డి.ఐ యోచనలో మోడి ప్రభుత్వం?

బి.జె.పి/నరేంద్ర మోడి ఎన్నికల వాగ్దానాల్లో రిటైల్ ఎఫ్.డి.ఐ ఒకటి. మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను యు.పి.ఏ ప్రభుత్వం అనుమతించగా బి.జె.పి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వస్తే ఈ నిర్ణయాన్ని తిరగదోడతామని బి.జె.పి వాగ్దానం ఇచ్చింది. సదరు వాగ్దానాన్ని నెరవేర్చడం మాట అటుంచి దొడ్డి దారిన యు.పి.ఏ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసే యోచనలో మోడి ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుండి తమకు గట్టి…

మబ్బులు తొలగును, అసలు తెలియును -కార్టూన్

“…ప్రారంభోల్లాస భ్రాంతి సర్దుకునే కొలదీ ఆర్ధిక స్ధితిగతులలు తన అసలు రూపాన్ని వ్యక్తం చేసుకుంటుంది..”  (ఆ రూపమే గదిలో ఏనుగు) మోడి: మనం మిత్రులమే కదా? *** స్వతంత్ర  భారత దేశ చరిత్ర లోనే పూర్తి మెజారిటీ సాధించిన మొట్ట మొదటి కాంగ్రెసేతర పార్టీగా బి.జె.పి మన్ననలు అందుకుంటోంది. బి.జె.పికి ఆ ఖ్యాతి దక్కించిన మహోన్నత నేతగా నరేంద్ర మోడి ప్రశంసలు పొందుతున్నారు. నిన్నటిదాకా ‘దూరం, దూరం’ అంటూ అస్పృశ్యత అమలు చేసిన బ్రిటన్, అమెరికాలు ‘రండి,…

మంత్రివర్గం పొందిక మార్కెట్లకు నచ్చలేదుట!

నరేంద్ర మోడి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఆగమనంతో మురిసిపోయిన విదేశీ (and hence స్వదేశీ) కంపెనీలు మంత్రి వర్గ నియామకాలు చూసి జావగారిపోయాయి. మార్కెట్ లకు ఈ మంత్రివర్గ పొందిక నచ్చలేదని మార్కెట్ విశ్లేషణ సంస్ధలు తేల్చిపారేశాయి. ఏనుగు మీద అదేదో ముతక సామెత చెప్పినట్లు అయిందే అని మార్కెట్లు వాపోతున్నాయిట. స్విట్జర్లాండ్ కి చెందిన బహుళజాతి ఆర్ధిక, ద్రవ్య సేవల సంస్ధ క్రెడిట్ సుసి, రాయిటర్స్ వార్తా సంస్ధ నిర్వహించే ‘మార్కెట్ ఐ’ శీర్షికలు సంయుక్తంగా…

మోడి గెలుపు: ఇక ఎఫ్.డి.ఐల వరదే -ఆసోఛామ్

నరేంద్ర మోడి ప్రచార సారధ్యంలో బి.జె.పి/ఎన్.డి.ఏ సాధించిన విజయం ధనిక వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మోడి అభివర్ణించిన ‘మంచి రోజులు’ తమకే అని వారికి బాగానే అర్ధం అయింది మరి! గుజరాత్ నమూనాను దేశం అంతా అమలు చేయడం అంటే స్వదేశీ-విదేశీ  కంపెనీలకు, పరిశ్రమలకు, దళారులకు మేలు చేస్తూ ప్రజల వనరులను వారికి కట్టబెట్టడమే అని కాంగ్రెస్ సైతం చెప్పే మాట! ఈ నేపధ్యంలో మోడి అనుసరించే విధానాల వల్ల దేశంలోకి ఈ యేడు రికార్డు స్ధాయిలో…

ఇంతకీ గెలిచిందెవరు? -కార్టూన్

2014 సాధారణ ఎన్నికల్లో గెలిచింది ఎవరు? పార్లమెంటు సెంట్రల్ హాలులో భావోద్వేగ పూరిత ప్రసంగం ఇచ్చిన నరేంద్ర మోడి కన్నీరు పెట్టుకోగా, ఓటమికి బాధ్యత వహించి రాజీనామా చేస్తామని చెప్పిన రాహుల్ మాత్రం యధావిధిగా కాంగ్రెస్ యువరాజుగా కొనసాగుతున్నారు. దానితో ఎన్నికల్లో గెలిచిందేవరన్న అనుమానం వస్తోందని ఈ కార్టూన్ సూచిస్తోంది.  పార్లమెంటు సెంట్రల్ హాల్ లో బి.జె.పి పార్లమెంటరీ నేతగా ఎన్నికయిన అనంతరం 30 నిమిషాలు ప్రసంగించిన మోడి ఆ సందర్భంగా కన్నీరు పెట్టుకున్నారని పత్రికలు నివేదించాయి.…

మోడికి బహిరంగ లేఖ -గోపాలకృష్ణ గాంధీ 2

పశ్చిమ పంజాబ్ నుండి తరిమివేయబడ్డ సిక్కులు, హిందువులకు మల్లే, కాశ్మీరీ పండిట్లకు మల్లే భారత దేశంలోని మైనారిటీలు అందరూ, ఒక్క ముస్లింలు మాత్రమే కాదు సుమా, తమ మనో ఫలకాలపై గాయపడ్డ చారికలు కలిగి ఉన్నారు. నిజంగానే జరుగుతాయో లేక ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టినందువల్ల జరుగుతాయో… అకస్మాత్తుగా అల్లర్లు జరగొచ్చన్న భయం, అవి మళ్ళీ మరిన్ని రెట్లు పగ సాధింపు పేరుతో తిరిగి తలుపు తడతాయన్న భయం, వారిని పట్టి పీడిస్తోంది. అవి మహిళలను అత్యంత ప్రత్యేకంగా లక్ష్యం…

నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ -గోపాలకృష్ణ గాంధీ -1

(గోపాల కృష్ణ గాంధీ మాజీ ఐ.ఏ.ఎస్ అధికారి మరియు రాయబారి. 2004-2009 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్ గానూ, 2005-2006 మధ్య బీహార్ అఫీషియేటింగ్ గవర్నర్ గానూ పని చేశారు. ఆయన మహాత్మా గాంధీ మనుమడు కూడా. ది హిందూ పత్రికకు ఆయన రాసిన వ్యాసానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)  ప్రియమైన ప్రైమ్ మినిస్టర్-డిసిగ్నేట్, నా హృదయపూర్వక అభినందనలతో ఈ లేఖ రాస్తున్నాను. నిజాయితీగానే నేనిలా భావిస్తూ మీకు చెబుతున్నాను. ఇలా (అభినందనలు) చెప్పడం నాకు…

నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ -గోపాలకృష్ణ గాంధీ

ప్రియమైన ప్రైమ్ మినిస్టర్-డిసిగ్నేట్, నా హృదయపూర్వక అభినందనలతో ఈ లేఖ రాస్తున్నాను. నిజాయితీగానే నేనిలా భావిస్తూ మీకు చెబుతున్నాను. ఇలా (అభినందనలు) చెప్పడం నాకు అంత తేలికయిన విషయం కాదు. ఎందుకంటే మీరు చేరుకున్న అత్యున్నత అధికార స్ధానాన్ని మీరు చేరుకోగా చూడాలని కోరుకున్నవారిలో నేను ఒకరిని కాను. మీరు ప్రధాన మంత్రి అవనున్నారని అనేక మిలియన్ల మంది ఆనంద పరవశులై ఎదురు చూస్తుంటే ఇంకా అనేక మిలియన్ల మంది నిజానికి వికలమై ఉన్నారన్న సంగతి మరే…