అణువిద్యుత్ ప్లాంటుల నిర్మాణంపై పునరాలోచనలో చైనా
జపాన్ లోని ఫుకుషిమా ‘దాయిచి’ అణువిద్యుత్ ప్లాంటు లో అణు రియాక్టర్లు పేలిపోయి పెద్ద ఎత్తున రేడియేషన్ విడుదల కావడం, రేడియేషన్ నియంత్రణకు జపాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమౌతుండడం, జపాన్ నుండి రేడియేషన్ ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తుండడం కారణాలతో పెద్ద ఎత్తున అణు విద్యుత్ ప్లాంటుల నిర్మాణం తలపెట్టిన చైనా పునరాలోచనలో పడింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని అణు విద్యుత్ ప్లాంటుల నిర్మాణాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అక్కడ భద్రతా వ్యవస్ధలను సమీక్షిస్తున్నట్లు…