$15 బిలియన్ల వ్యాపార ఒప్పందాలకు చైనా, జర్మనీల అంగీకారం

యూరప్ పర్యటనలో ఉన్న చైనా ప్రధాని వెన్ జియాబావో, ఇంగ్లండులో మూడు రోజులు పర్యటించిన అనంతరం బుధవారం జర్మనీకి చేరుకున్నాడు. జర్మనీ పర్యటనలో 15 బిలియన్ డాలర్ల మేరకు వ్యాపార ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేసారని బిబిసి తెలిపింది. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్, చైనా ప్రధాని వెన్ లు వ్యాపార ఒప్పందాలపై చర్చలు జరిపి అంగీకారానికి వచ్చారు. ద్వైపాక్షిక వ్యాపారం రానున్న 5 సంవత్సరాల్లో 200 బిలియన్ యూరోల (284 బిలియన్…