“సెప్టెంబరు 11” కి పదేళ్ళు -కార్టూన్
న్యూయార్క్, అమెరికా, నగరంలోని ప్రపంచ వాణిజ్య సంస్ధకు చెందిన జంట టవర్లపై టెర్రరిస్టు దాడులు జరిగి నేటితో (సెప్టెంబరు 10) పదేళ్ళు నిండాయి. దాడుల్లో మూడువేలకు పైగా చనిపోయారని అమెరికా తెలిపింది. టెర్రరిస్టు దాడుల్లో చనిపోయిన అమెరికన్లకు పూర్తిగా సానుభూతి, సహకారం అందించే లోపే, అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్, అదే దుర్ఘటనను అడ్డు పెట్టుకుని దురాక్రమణ యుద్ధాలకి తెర లేపాడు. రుజువుకాని నేరాన్ని మోపి, రుజువు కానవసరం లేదన్నట్లుగా, ఘటనతో సంబంధం లేని రెండు దేశాలు,…