చైనాలొ తేనెటీగల్ని ఆకర్షించి, వొంటినే తేనెతుట్టెగా మలిచే పోటీ -ఫోటోలు

తేనెటీగల దండు వస్తుంటేనే చూసి పారిపోతాం మనం. అవి మన శరీరంలో నాటే కొండీలు యమ బాధని కలిగిస్తాయి. కాని చైనాలో ఏకంగా తమ శరీరాలనే తేనెతుట్టెలుగా మార్చే పోటీ జరగడం విశేషం. చూడడం తర్వాత సంగతి, తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడిచే ఈ పోటీ దృశ్యాలను చూసి తీరవలసిందే మరి. చైనా లోని హూనాన్ రాష్ట్రంలో “షావో యాంగ్” ఊరిలో ఈ తేనెటీగల్ని ఆకర్షించే పోటీ జరిగింది. ఈ పోటీలో పాల్గొనేవారు తాము పెంచుకున్న రాణి తేనెటీగల్ని…