రేప్ కి ఆడోళ్ళే కారణం అంటున్న ఢిల్లీ పోలీసులు, తెహెల్కా పరిశోధన (పునర్ముద్రణ)

(ఈ ఆర్టికల్ ఏప్రిల్ 7, 2012 తేదీన మొదటిసారి ఈ బ్లాగ్ లో ప్రచురితమయింది. అమానత్ విషాదాంతం సందర్భంగా అత్యాచారాల విషయంలో ఢిల్లీ పోలీసుల దృక్పధం ఎలా ఉన్నదో గుర్తు తెచ్చుకోవడానికి తేదీ మార్చి మళ్ళీ ప్రచురిస్తున్నాను. భారత సమాజాన్నీ, సంస్కృతినీ ఇలాంటి పుచ్చిపోయిన మెదళ్లు శాసిస్తూ, రక్షకులుగా ఉన్నంతవరకూ అత్యాచారాలు ఆగవనీ, దోషులందరికీ తగిన శిక్షలు పడవనీ తేలికగానే అర్ధం అవుతుంది -విశేఖర్) – “ఆవిడే కోరి వెళ్ళింది” “అంతా డబ్బు కోసమే” “ఇదో వ్యాపారం…

బంగారు లక్ష్మణ్ కి నాలుగేళ్ళు జైలు, జడ్జి సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ కోర్టు బి.జె.పి మాజీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి బంగారు లక్ష్మణ్ కి నాలుగేళ్ళు జైలు శిక్ష విధించింది. జరిమానాగా లక్ష రూపాయలు చెల్లించాలని జడ్జి తీర్పు నిచ్చాడు. శిక్ష విధిస్తూ అడిషనల్ సెషన్స్ జడ్జి కన్వల్ జీత్ అరోరా సంచలన వ్యాఖ్యలు చేశాడు. జడ్జి విధించిన శిక్ష, తదనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాపితంగా ఉన్న కోర్టులు పాటించినట్లయితే దాదాపు భారత దేశ నాయకులు, బ్యూరోక్రాట్ అధికారులు అందరూ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే.…

అవినీతి కేసులో బి.జె.పి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ దోషి -సి.బి.ఐ కోర్టు

బి.జె.పి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ను అవినీతి కేసులో దోషిగా సి.బి.ఐ కోర్టు నిర్ధారించింది. తెహెల్కా పత్రిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో కంపెనీ ప్రతినిధులుగా నాటకమాడిన తెహెల్కా విలేఖరుల వద్ద నుండి లక్ష రూపాయల నోట్ల కట్లను తీసుకుంటూ బంగారు లక్ష్మణ్ వీడియో కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. 2001 లో జరిగిన ఈ సంఘటనలోని వీడియో దేశ వ్యాపితంగా అన్నీ చానెళ్లలోనూ ప్రసారం అయింది. పార్టీ కోసం చందా తీసుకున్నానని లక్ష్మణ్ అప్పట్లో వివరణ…