రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు బి.జె.పి ఆటంకం?
‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2014’ బిల్లు బుధవారం (ఫిబ్రవరి 19) రాజ్యసభలో ప్రవేశించలేదు. ఇందుకు బి.జె.పి కారణంగా నిలిచింది. లోక్ సభలో బిల్లుకు ఒక్క సవరణ కూడా ప్రతిపాదించని బి.జె.పి రాజ్యసభలో మాత్రం 32 సవరణలు చేయాలంటూ బయలుదేరింది. దీనికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు. ఫలితంగా తెలంగాణ బిల్లు లేకుండానే రాజ్య సభ వాయిదా పడింది. లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లుకు రాజ్యసభలో సవరణలు చేస్తే రాజ్యాంగ సూత్రాల రీత్యా సమస్య వస్తుంది. రాజ్యసభలో బిల్లుకు…













