“డే ఆఫ్ డిపార్చర్” పాటిస్తున్న ఈజిప్టు జనం, తెర వెనుక అమెరికా బిజీ
ఈజిప్టులో ఆందోళనకారులు ముబారక్ శుక్రవారం (ఫిబ్రవరి ౪) లోగా రాజీనామా చేయాలని గడువు విధించిన సంగతి విదితమే. తమ డిమాండును గట్టిగా వినిపించటానికి శుక్రవారం అన్ని ప్రధాన పట్టణాలలో ప్రజలు పదుల వేల సంఖ్యలో చేరుతున్నట్లుగా బిబిసి వార్తా సంస్ధ తెలిపింది. ప్రెసిడెంటు గా తానూ విసిగిపోయాననీ, కానీ తాను దిగిపోతే దేశంలో అల్లకల్లోల పరిస్థిలు ఏర్పడతాయి కనుక తాను రాజీనామా చేయబోననీ ముబారక్ ప్రకటించాడు. ఆందోళనకారుల నాయకుల్లో ఒకరైన్ అల్ బరాదీ అధ్యక్షునికి సమధానం ఇస్తూ…