అమెరికాలో వామపక్షం అంటే అర్ధమే వేరు!

అమెరికాలో నవంబరు 5 తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హ్యారీస్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. వాస్తవానికి ఇప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తానే రెండోసారి కూడా అధ్యక్ష పదవి రేసులో నిలబడాలని కోరుకున్నాడు. కానీ బహిరంగ సభల్లో, విదేశీ పర్యటనల్లో, పబ్లిక్ కార్యకలాపాల్లో ఆయన క్రమంగా డిమెన్షియా జబ్బుకు గురవుతున్న పరిస్ధితి స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ ఏదో విధంగా జో బైడెన్…

హిల్లరీ: ఆమె గాజు పైకప్పు బద్దలు కొట్టారట!

అమెరికా డెమోక్రటిక్ పార్టీ జరిపిన సదస్సులో హిల్లరీ రోధమ్ క్లింటన్ అధ్యక్ష పదవి అభ్యర్థిగా అధికారికంగా నామినేషన్ పొందారు. ఆమె నామినేషన్ ను అమెరికా పత్రికలు, ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతుగా వచ్చే మీడియా “చరిత్ర సృష్టి” గా ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తరచుగా కీర్తించుకునే అమెరికాలో అభ్యర్థి పదవికి అభ్యర్థిగా నామినేషన్ పొందిన మొట్టమొదటి మహిళ హిల్లరీ క్లింటన్ కావడమే వారి ఉబ్బితబ్బిబ్బులకు కారణం. అమెరికాకు స్వతంత్రం వచ్చి 240 యేళ్ళు…