50% అమెరికా సుంకాల తగ్గింపుకి బ్రోకర్లని నియమించిన ఇండియా!

Mercury Public Affairs ఇండియాలో వివిధ వ్యాపారాల్లో అనేక రకాల బ్రోకర్లు ఉంటారు. పల్లెల్లో గేదెలు, దున్నలు లాంటివి అమ్మి పెట్టటానికి కొనుగోలుదారుల్ని వెతికి పెట్టడానికి ఉండే బ్రోకర్లను ‘కాయిదా’ మనుషులు అంటారు. స్థలాలు, ఇళ్లు అమ్మి పెట్టడం – కొనుగోలుదార్లను వెతికి పెట్టేవాళ్లను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటారు. సినిమా యాక్టర్లకు సినిమాలు సంపాదించి పెట్టే ట్యాలెంట్ బ్రోకర్లు మరి కొందరు. షేర్ మార్కెట్ లో షేర్లు అమ్మటం కొనటం చేసే వాళ్ళను స్టాక్ బ్రోకర్లు…