తుఫాను సాయం ప్లీజ్ -ఆగ్నేయ అమెరికా!
– ఆగ్నేయ అమెరికన్లు: హెలెనే తుఫాను సాయం చేయండి, ప్లీజ్! వాషింగ్టన్: సారీ, ఇజ్రాయెలీ యుద్ధ పిపాసులకు మద్దతుగా మరిన్ని వేల మంది అమెరికా సైన్యాన్ని పంపించాలనా మీరు అడుగుతున్నది? ఆగ్నేయ అమెరికన్లు: కాదు మహా ప్రభో! హెలెనే హరికేన్ వల్ల తీవ్రంగా దెబ్బ తిన్నాం, కాస్త సాయం చేయమని అడుగుతున్నాం. వాషింగ్టన్: ఒకే. మీకు పరిస్ధితి ఏమీ అర్ధం అవుతున్నట్లు లేదు. కానీ మన సైన్యం ఇప్పటికే ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండలో ఒక చెయ్యి వేసేందుకు…


