జపాన్ లో మరో అణు ప్రమాదం, రేడియేషన్ నీరు లీకేజి
జపాన్ లో మరో అణు ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. వాయవ్య జపాన్ లో నెలకొల్పిన ఇక అణు విద్యుత్ కర్మాగారంలోపల రేడియెషన్ కలిసి ఉన్న నీరు లీక్ అవుతున్నట్లు కనుగొన్నారని తెలుస్తోంది. ఈ రేడియెషన్ లీకేజి అణు విద్యుత్ కర్మాగారం లోపలి వరకే పరిమితం అయిందనీ, ఇంకా వాతావరణంలోకి వెలువడలేదనీ తెలుస్తోంది. అయితే వాతావరణంలోకి రేడియేషన్ విడుదల కాకుండా జాగ్రత్తలు తీసుకున్నదీ లేనిదీ తెలియరాలేదు. వాయవ్య జపాన్ లో ఉన్న క్యుషు ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ (కెప్కో)…