అమెరికా దాడి చేస్తే సిరియాకు సాయం చేస్తాం -పుతిన్

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ రంగంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సాహసోపేతమైన అడుగు వేసినట్లే కనిపిస్తోంది. అంతర్ధానం అవుతున్న అమెరికా ప్రాభవం స్ధానంలో రష్యాను ప్రవేశపెట్టడానికి లేదా రష్యాకు వీలయినంత చోటు దక్కించడానికి పుతిన్ ఏ అవకాశాన్ని వదులుకోదలచలేదని ఆయన మాటలు చెబుతున్నాయి. పెద్దగా పటాటోపం లేకుండా, వాగాడంబరం జోలికి పోకుండా నిశ్శబ్దంగానే అయినా స్ధిరంగా ఆయన వేస్తున్న అడుగులు, చేస్తున్న ప్రకటనలు పశ్చిమ సామ్రాజ్యవాదులకు బహుశా చెమటలు పట్టిస్తుండవచ్చు. సిరియాపై అమెరికా ఏకపక్షంగా దాడి…

స్విస్ ఖాతాల సమాచారం పొందడానికి నిబంధనలు సరళతరం

స్విస్ బ్యాంకుల్లో దొంగ సొమ్ము దాచిన భారతీయుల సమాచారం పొందడానికి ఇప్పటివరకూ ఉన్న నిబంధనలు మరింత సరళతరం అయ్యాయని భారత ప్రభుత్వం తెలియజేసింది. ‘బ్లాక్ మనీ’ పై భారత ప్రభుత్వం తలపెట్టిన పోరాటం తాజా పరిణామంతో ఊపందుకుంటుందని భావిస్తున్నట్లు ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. రహస్య ఖాతాలున్న వ్యక్తుల సమాచారం స్విస్ ప్రభుత్వం మనకు ఇవ్వడానికి ఇకనుండి పేరు, చిరునామా పూర్తిగా ఇవ్వకపోయినా ఫర్వాలేదనీ, సమీప సమాచారం ఇస్తే సరిపోయే విధంగా నిబంధనలు సడలించారనీ ప్రభుత్వం తెలిపింది.…

యూరప్ రుణ సంక్షోభాన్ని ప్రపంచానికి అంటించొద్దు -అమెరికా తదితరులు

శుక్రవారం, జి20 గ్రూపు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అభివృద్ధి చెందిన దేశాలు, ప్రధాన ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ దేశాలు సభ్యులుగా ఉన్న ఈ గ్రూపు సమావేశాల సందర్భంగా యూరప్ రుణ సంక్షోభం పరిష్కరించే బాధ్యతను ప్రపంచ దేశాలపై వేయడానికి యూరప్ దేశాలు (ఇ.యు) చేసిన ప్రయత్నాన్ని అమెరికా తదితర దేశాలు తిప్పికొట్టాయి. యూరప్ రుణ సంక్షోభాన్ని యూరప్ దేశాలే పరిష్కరించుకోవాలనీ, ప్రపంచానికి అంటించాలనుకోవడం సరికాదని అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలు వాదించాయి. యూరప్ రుణ సంక్షోభం…