ఇరాన్ యుద్ధం మళ్ళీ మొదలైందా? -నోట్స్ & అప్డేట్స్ 13

– 08/06/2026 యుద్ధం సరికొత్త దశలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది. లెబనాన్, ఇజ్రాయిల్ ల మధ్య ఏప్రిల్ 8 తేదీన కుదిరిన సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మరుసటి రోజు నుండి ఉల్లంఘిస్తూనే ఉంది. ఉల్లంఘన కొనసాగిస్తే తాము ఇజ్రాయెల్ పైన దాడి చేయక తప్పదని ఇరాన్ కూడా హెచ్చరిస్తూనే ఉంది. కానీ అప్పటి నుండి ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. లెబనాన్ రాజధాని బీరూట్ లో హిజ్బోల్లా కి పట్టు ఉన్న దక్షిణ ప్రాంతాలపై కూడా ఇజ్రాయెల్ పౌర…

అద్భుత విజయం సాధించిన ఇరాన్ ప్రతిఘటన!

– అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలలో ఉన్నది మెదడా లేక ఇంకేమన్నా పదార్ధం పెట్టుకున్నాడా అన్నది తెలియక ప్రపంచం సతమతం అవాల్సిన పరిస్ధితి దాపురించింది. ట్రంప్ లాంటి మనిషి ఇంకోసారి ఏ దేశానికైనా అధ్యక్షుడుగా ఎన్నిక కాకుండా అన్ని దేశాల ప్రజలు శపధం చేయాల్సిన అత్యవసర పరిస్ధితి వచ్చి పడింది. హోర్ముజ్ జలసంధి ని తెరిచే విషయంలో నిన్నటి వరకు ఇరాన్ ని బెదిరిస్తూ వచ్చాడు డొనాల్డ్ ట్రంప్! “ఓపెన్ ద ఫ_ _ హోర్ముజ్…

అమెరికా, ఇజ్రాయెల్ లను లొంగదీసిన ఇరాన్ ప్రతిఘటనకు ప్రపంచం మద్దతు ఇవ్వాలి!

అసలు అమెరికా, ఇరాన్ దేశాల నుండి అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందం సావధానంగా చర్చలకు కూర్చోవటమే ఒక అద్భుతం అని పత్రికలన్నీ పొగుడుతున్నాయి. నిజమే కావచ్చు. కానీ ఆ అద్భుతం కేవలం ఇరాన్ ధైర్య సాహసాలతో అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ ఐరోపాలు 6 వారాల పాటు సాగించిన నరహంతక, మానవీయతా వ్యతిరేక యుద్ధాన్ని ప్రతిఘటించటం వల్లనే సాధ్యపడింది.