మూడో రియాక్టర్ పేలుడు, జపాన్ లో అత్యంత ప్రమాదకర స్ధాయికి చేరుకున్న అణు ధార్మికత

జపాన్ భూకంపం, సునామీల కారణంగా సోమవారం వరకు రియాక్టర్ నెం. 1, 3 లలో పేలుళ్ళు జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం నెం. 2 రియాక్టరు కూడా పేలిపోయింది. దానితో పాటు భూకంపం రావడానికి చాలా రోజుల ముందే నిర్వహణ నిమిత్తం మూసివేసిన నెం.4 రియాక్టరులో కొద్ది సేపు మంటలు ఎగసిపడ్డాయి. నాల్గవ రియాక్టరు పనిలో లేనప్పటికీ వాడిన ఇంధన రాడ్లను అక్కడే ఉంచడం వలన అక్కడ కూడా అణు ధార్మికత వెలువడే ప్రమాదం తలెత్తింది. రెండో…

రెండో అణు రియాక్టర్ పేలుడు, అణు ప్రమాదం అంచున జపాన్

8.9 పాయింట్ల భూకంపం, ఆ తర్వాత ఏళ్ళూ, ఊళ్ళూ ఏకం చేస్తూ ఉవ్వెత్తున ఎగసిపడిన సునామీ, అటు పిమ్మట ఫుకుషిమా దాయీచి నెం.1 అణు రియాక్టర్ పేలుడు, ఇప్పుడు దాయీచి నెం.3 అణు రియాక్టర్ పేలుడు… ఒకదాని వెంట మరొకటి వచ్చిపడుతున్న కష్టాలతో జపాన్ ప్రభుత్వం, ప్రజలు తీవ్రమైన సంక్షోభంలో మునిగి ఉన్నారు. ఒకదాని నుండి తేరుకునే లోగానే మరొక కష్టం విరుచుకు పడుతోంది. నెం.1, నెం.3 అణు రియాక్టర్లు ఇప్పటికే పేలిపోగా నెం.2 రియాక్టర్లో నీటి…

జపాన్ ను అతలాకుతలం చేసిన భూకంపం, సునామీలు

శుక్రవారం ఈశాన్య జపాన్ సముద్ర అంతర్భాగాన సంభవించిన భూకంపం, దానివలన ఏర్పడిన సునామీలు జపాన్ ఈశాన్య ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. అతి వేగంగా దూసుకొచ్చిన సునామీ ప్రజలను కోలుకోకుండా దెబ్బతీశాయి. సునామీ ధాటికి పెద్ద పెద్ద నౌకలు సైతం తీరాన్ని దాటి ఒడ్డున ఉన్న పట్టణాల్లోని భవనాలను ఢీకొట్టాక గాని ఆగలేదు. పడవలు, కార్లు, బస్సులు లాంటి వాహనాలు ఒకదానిపై ఒకటి చేరి ఇతర శిధిలాలతో కలిసి చెత్తకుప్పలను తలపిస్తున్నాయి. విస్తారమైన ప్రాంతాలు సునామీ ద్వారా కొట్టుకువచ్చిన…

జపాన్ ను వణికించిన భారీ భూకంపం, ముంచెత్తిన సునామీ

[అప్ డేట్: జపాన్ సునామీలో మరణించిన వారి సంఖ్య: 300 దాటింది] జపాన్ దేశంలోని ఈశాన్య ప్రాంతానికి సమీపంలో సమద్ర గర్బాన భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్బాన భూకంపం సంభవించడం వలన అది భారీ సునామీగా పరిణమించి జపాన్ తీరప్రాంతాన్ని ముంచెత్తింది. రిక్టర్ స్కేల్ పై 8.9 గా నమోదైన ఈ భూకంపం, జపాన్ లో 140 సంవత్సరాల క్రితం భూకంపం రికార్డులు నమోదు చేయడం ప్రారంభించినప్పటి నుండి అత్యంత భారీ భూకంపంగా జపాన్ తెలిపింది.…