ఫుకుషిమా ప్రమాదంలో రేడియేషన్ అంచనాకు రెట్టింపుకంటె ఎక్కువే విడుదలైంది
ఫుకుషిమా అణు ప్రమాదం వలన వాతావరణంలో విడుదలైన రేడియేషన్ ఇప్పటివరకూ అంచనా వేసినదానికంటే రెట్టింపుకంటె ఎక్కువేనని ప్రమాదంపై దర్యాప్తు జరపనున్న స్వతంత్ర నిపుణులతో కూడిన దర్యాప్తు సంస్ధ దర్యాప్తు ప్రారంభించడానికి ముందు జపాన్ అణు ఏజన్సీ వెల్లడించింది. అంతే కాకుండా మూడు రియాక్టర్లలో ఇంధన కడ్డీలు ఇప్పటిదాకా అనుకుంటున్న సమయానికంటే చాలా ముందుగానే కరిగి రియాక్టర్ల క్రింది బాగానికి చేరిందని ఏజెన్సీ చెబుతున్నది. వచ్చే జనవరిలోగా ఫుకుషిమా అణు కర్మాగారాన్ని మూసివేయోచ్చని అణు కర్మాగారం ఆపరేటర్ టోక్యో…