జపాన్ లో అణువిద్యుత్ ప్లాంటులను చల్లబరిచే యత్నాలు ముమ్మరం
జపాన్ ప్రభుత్వం ఫుకుషిమా లోని దైచి అణు విద్యుత్ ప్లాంటులో పేలిపోయిన రియాక్టర్లను చల్లబరిచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా మిలట్రీ హెలికాప్టర్ల ద్వారా సముద్రపు నీటిని ప్లాంటుపై జారవిడుస్తున్నది. ఈ ప్రక్రియను బుధవారం మొదలు పెట్టినప్పటికీ రేడియేషన్ స్ధాయి ఎక్కువగా ఉండటంతో విరమించుకున్నారు. హెలికాప్టర్లతో పాటు ప్లాంటు వద్ద వాటర్ కెనాన్ లను ఉపయోగించి నీళ్ళు వెదజల్లుతున్నారు. మొదట పోలిసులు ప్రయత్నించినా వారు రేడియేషన్ కి గురయ్యే ప్రమాదం ఉండడంతో వారిని వెనక్కి రప్పించారు. మిలట్రీ…